భారత క్రికెట్ అభిమానులు గత కొన్ని రోజులుగా బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్, టీ20 వన్డే సిరీస్‌ల్లో రుతురాజ్ సత్తా చాటుతున్న అతనికి అవకాశాలు ఇవ్వకపోవటంపై అభిమానులు మండిపడుతున్నారు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ రుదురాజ్ మంచి ప్రదర్శన చేశాడు. అయితే శ్రీలంకతో జరిగే టీ20, వన్డే జట్టులో అతడికి ఎందుకు చోటు ఇవ్వలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
అయితే బీసీసీఐ మౌనం కారణంగా గంభీర్, గిల్‌లపై పలువురు విమర్శలు గుప్పించారు. రుతురాజ్ ధోనీ శిష్యుడు కాబట్టి గంభీర్‌కు అవకాశం ఇవ్వలేదని.. రుతురాజ్ గిల్‌కు పోటీ కాబట్టి అవకాశం ఇవ్వలేదుని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ స్థితిలో రుతురాజ్ చేర్చుకోకపోవడానికి మరో కారణం కూడా ఉండొచ్చనే సమాచారం బయటకు వస్తోంది. రుతురాజ్ భార్య ప్రెగ్నేన్సీతో ఉండటం, తను ఈ నెలాకరులో వైద్యులు డెలీవరీకి డేట్ ఇవ్వటంతో ఈ సిరీస్‌లో ఆడకపోవచ్చని తెలుస్తోంది.
గతంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు స్టార్ విరాట్ కోహ్లీ అకస్మాత్తుగా జట్టు నుంచి వైదొలిగాడు. దీనికి కారణం ఏమిటో బీసీసీఐ అప్పుడు చెప్పలేదు. ఆ తర్వాత పాప పుట్టిన రెండు రోజులకు విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో తెలిపాడు. ఆసమయంలో ఈ విషయంపై బీసీసీఐ మౌనం వహించింది. అందుకే రుతురాజ్ విషయంలోనూ బీసీసీఐ వివరణ ఇవ్వలేదని భావిస్తున్నారు. అయితే దీనికి గల కారణాలపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో వివరణ ఇస్తారని అభిమానులు భావించారు.కానీ అగార్కర్ అసలు ఆ విషయాన్ని విలేకరుల సమావేశంలో తీసుకురాలేదు.దీంతో సోషల్ మీడియాలో అభిమానుల నుంచి బీసీసీఐ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.