The GOAT : విజయ్ 'గోట్' నుంచి 'స్పార్క్' సాంగ్ వచ్చేసింది.. తలపతి స్టైలిష్ లుక్స్, డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..!

విజయ్ 'ది గోట్' మూవీ నుంచి మేకర్స్ తాజాగా థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు. 'స్పార్క్' అనే పేరుతో రిలీజైన ఈ సాంగ్ లో విజయ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. యువన్‌ శంకర్‌ రాజా కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను మరో సింగర్ తో కలిసి ఆయనే స్వయంగా పాడారు.

New Update
The GOAT : విజయ్ 'గోట్' నుంచి 'స్పార్క్' సాంగ్ వచ్చేసింది.. తలపతి స్టైలిష్ లుక్స్, డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..!

Thalapathy Vijay The GOAT Movie : కోలీవుడ్ హీరో తలపతి విజయ్ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం ఉంది.. ప్రతి సినిమాతో కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ స్టార్ హీరో, తన తాజా చిత్రం 'ది గోట్'తో మరోసారి అంచనాలను పెంచేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' అనే పేరుకు తగ్గట్లుగానే ఈ సినిమాలో విజయ్ మరోసారి రెండు డిఫెరెంట్ రోల్స్ లో మెప్పించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైనపోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ అందుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. సినిమాలో విజయ్ న్యూ లుక్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు.

Also Read : అలాంటి సినిమాలు చాలా డేంజర్.. వాటి జోలికి వెళ్లకపోవడమే మంచింది : రామ్ గోపాల్ వర్మ

'స్పార్క్' అనే పేరుతో రిలీజైన ఈ సాంగ్ లో విజయ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. అటు మీనాక్షి చౌదరి సైతం తన అందాలతో ఆకట్టుకుంది. యువన్‌ శంకర్‌ రాజా కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను మరో సింగర్ తో కలిసి ఆయనే స్వయంగా పాడారు.

ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా కొత్త ప్రమాణాలను సెట్ చేయబోతుంది. అగ్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
తాజా కథనాలు