TGSRTC: ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఫోన్ పే, గూగుల్ పేతో టికెట్స్

TG: ప్రయాణికులకు RTC తీపి కబురు అందించింది. బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. తొలుత పైలెట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ డిపోల్లో అమలు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.

New Update
City Buses : మహిళలకు సిటీ బస్ లో ఫ్రీ జర్నీ ఉంటుందా? ఉండదా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ!

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు అందించింది. ఇకపై బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అందుబాటులోకి తేనుంది. తొలుత పైలెట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ డిపోల్లో ఇది అమలు అవుతోందన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. కొద్ది రోజుల్లోనే అన్ని డిపోల్లో అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఇందుకోసం 10వేల ఐ-టిమ్ మెషీన్లను తమ సిబ్బందికి ఆర్టీసీ అందించనుంది. దీని ద్వారా ప్రయాణికులు ఫోన్ తో QR కోడ్ స్కాన్ చేసి డబ్బు చెల్లించి టికెట్ పొందవచ్చు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో అటు కండక్టర్లకు, ఇటు ప్రయాణికులకు 'చిల్లర' కష్టాలు తప్పనున్నాయి.

ఇప్పటికే కొన్ని రూట్లలో గరుడ, రాజధాని, సిటీ బస్సుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది ఆర్టీసీ సంస్థ. చిల్లర సమస్య, లావాదేవీలలో పారదర్శకత ఉంచేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ప్రెమెంట్స్ అమలు చేయడం వల్ల పేపర్, ప్రింటర్ వంటి వాటికీ అయ్యే ఖర్చులు కూడా కాస్త తగ్గుతుందని ఆర్టీసీ భావించింది. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది.

మహిళలకు ప్రత్యేక కార్డు..

తెలంగాణలో కొలువుదీరిన రేవంత్ సర్కార్ ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఆధార్ కార్డు ద్వారా జీరో టికెట్ ను మహిళలకు ఇస్తున్నారు. కాగా తాజాగా మహాలక్ష్మి పథకంపైన కూడా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు స్మార్ట్ కార్డు ను ఇవ్వనుంది. ఆధార్ కార్డుతో ఈ కార్డును అనుసంధానం చేయనున్నట్లు సమాచారం.

Also Read : RTV చెప్పిందే.. సీఎం రేవంత్ చెప్పారు

Advertisment
తాజా కథనాలు