RTC JOBS: ఆర్టీసీలో 3035 ఉద్యోగాలపై సజ్జనార్ కీలక ప్రకటన!

ఆర్టీసీలో 3035 ఉద్యోగాలకు సంబంధించి వైరల్ అవుతున్న లింక్స్ అన్నీ ఫేక్ అని ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆ లింక్‌లను ఉద్యోగార్థులు నమ్మొద్దు. క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చెయొద్దన్నారు. త్వరలోనే అధికారిక లింక్ విడుదల చేస్తామన్నారు.

New Update
RTC JOBS: ఆర్టీసీలో 3035 ఉద్యోగాలపై సజ్జనార్ కీలక ప్రకటన!

Sajjanar: ఆర్టీసీలో 3035 ఉద్యోగాలకు సంబంధించి ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన జారీ చేశారు. అప్లికేషన్ ప్రక్రియకు సంబంధించి ఫేక్ లింక్స్ క్రియేట్ అయ్యాయని, అందులో అభ్యర్థుల వివరాలు ఎంటర్ చేయకూడదని సూచించారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన సజ్జనార్.. ఆర్టీసీ ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3035 కొలువుల భర్తీకి సంబంధించిన కసరత్తును టీజీఎస్ ఆర్టీసీ ప్రారంభించింది. 3035 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలు, దరఖాస్తు ఫీజు, తదితర వివరాలను అందులో పేర్కొన్నారు. అవన్నీ ఫేక్. ఆ లింక్ లను ఉద్యోగార్థులు నమ్మొద్దు. క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చెయొద్దని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది' అంటూ క్లారిటీ ఇచ్చారు.

Advertisment
Advertisment