TGPSC: ఆగం చేసిన ఆధార్ కార్డు.. భర్త పేరుందని గ్రూప్1 పరీక్షకు నో ఎంట్రీ!

ఆధార్ కార్డులో తండ్రి బదులు భర్త పేరు చేర్చడంతో ఓ గ్రూప్ 1 అభ్యర్థి పరీక్షకు దూరమైంది. అప్లికేషన్ తర్వాత పెళ్లి జరిగిందని, కొత్త ఆధార్ కార్డు అని చెప్పినా అధికారులు అనుమతించలేదు. దీంతో సదరు యువతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వివరాల కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

TGPSC: ఆగం చేసిన ఆధార్ కార్డు.. భర్త పేరుందని గ్రూప్1 పరీక్షకు నో ఎంట్రీ!
New Update

Adilabad: తెలంగాణలో గ్రూప్1 అభ్యర్థిని ఆధార్ కార్డు ఆగం చేసింది. ఎగ్జామ్ రాసేందుకు సెంటర్ కు వెళ్లిన యువతికి అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆమె ఆధార్‌ కార్డులో తండ్రి పేరుకు బదులు భర్త పేరు ఉందనే కారణంతో పరీక్షకు అనుమతించలేదు. ఈ ఘటన ఆదిలాబాద్‌ పట్టణం చావర పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రంలో జరగగా.. వివరాలు ఇలా ఉన్నాయి.

పెళ్లికి ముందు అప్లై.. పెళ్లి తర్వాత ఎగ్జామ్..
ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన ఓ యువతి గ్రూప్ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకుంది. అయితే అప్లై చేసుకునేనాటికి ఆమెకు పెళ్లి కాలేదు. దీంతో అప్లికేషన్ ఫామ్ లో తండ్రిపేరునే చేర్చింది. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. ఇటీవలే పెళ్లి చేసుకున్న యువతి ఆధార్ కార్డులో తండ్రి పేరు తొలగించి భర్త పేరును చేర్చింది. తన ఇంటిపేరు కూడా ఆధార్ కార్డులో మార్పించుకోవడమే ఆమెకు శాపంగా మారింది. పెళ్లి తర్వాత వాడుతున్న ఆధార్ కార్డు తీసుకుని పరీక్ష సెంటర్ కు వచ్చిన యువతిని ఆధారాలు సరిగా లేవనే నెపంతో అధికారులు లోపలికి అనుమతించలేదు.

అధికారుల తీరుపై అసంతృప్తి..
ఆమె ఎంత చెప్పినా వినకుండా సరైన ఆధారాలు చూపించాలని అడిగారు. పెళ్లికి ముందు, ఆ తర్వాత పత్రాలు చూపిస్తేనే పరీక్షకు అనుమతిస్తామన్నారు. కానీ పాత ఆధార్ కార్డు తెప్పించుకునేలోపు పరీక్ష మొదలు కావడంతో సదరు యువతి గ్రూప్ 1 పరీక్షకు హాజరుకాకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాను ఏ తప్పు చేయలేదని, నిజమైన క్యాండెట్ అంటూ ఎంత బలతిమిలాడిని ప్రయోజనం లేకపోయిందని అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదిలావుంటే.. బాధితురాలు ఇప్పటికే జేఎల్‌ ఉద్యోగానికి ఎంపికైనట్లు సమాచారం.

#aadhaar-card #group-1-exam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe