TGPSC: గ్రూప్-2 అభ్యర్థుల‌కు అల‌ర్ట్.. ఎడిట్ ఆప్షన్ కు ఇదే చివరి తేదీ!

గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. అప్లికేషన్ ఎడిట్ అప్షన్ కు సంబంధించిన మార్గదర్శకాలను టీజీపీఎస్సీ విడుదలచేసింది. జూన్ 16-20 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఆగస్టు 7, 8న గ్రూప్ -2 పరీక్ష జరగనుంది.

New Update
TGPSC: గ్రూప్-2 అభ్యర్థుల‌కు అల‌ర్ట్.. ఎడిట్ ఆప్షన్ కు ఇదే చివరి తేదీ!

TGPSC Group 2 Edit Option: తెలంగాణ గ్రూప్ -2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ (TGPSC) కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ పరీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అప్లికేషన్ లో తప్పులుంటే ఎడిట్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. ఈ మేరకు జూన్ 16న ఉదయం 10 గంటల నుంచి జూన్ 20 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. అలాగే ఎడిట్‌కు ఇదే చివరి అవకాశం. మరో అవకాశం ఉండబోదు అని అధికారులు స్పష్టం చేశారు.

ఈ మేరకు ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకునే అభ్యర్థులు ఎస్ఎస్‌సీ, ఆధార్ కార్డుకు సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని టీజీపీఎస్సీ తెలిపింది. ద‌ర‌ఖాస్తుల ఎడిట్ పూర్తైన త‌ర్వాత త‌ప్పనిస‌రిగా త‌మ ద‌ర‌ఖాస్తును పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించింది. ఇక గ్రూప్ -2 పరీక్షను ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవలే షెడ్యూల్ రిలీజ్ చేసింది.

ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ..
ఇదిలా ఉంటే.. తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 2, 3న Group 2 పరీక్ష నిర్వహించాల్సి ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను రీషెడ్యూల్‌ చేశారు. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు. ఆగస్టు 7వ తేదీ ఉదయం పేపర్-1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం పేపర్-2 (చరిత్ర, రాజకీయం, సమాజం) పరీక్ష జరగనుంది. అలాగే ఆగస్టు 8వ తేదీ ఉదయం పేపర్-3 (ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి), మధ్యాహ్నం పేపర్-4 ( తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) పరీక్ష జరగనుంది. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కోమార్కు. నాలుగు పేపర్లలో కలిపి 600 మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Also Read: వారి ఆత్మహత్యలకు నీట్ తో సంబంధం లేదు.. సుప్రీం కోర్టు!

Advertisment
Advertisment
తాజా కథనాలు