TGPSC Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. వారంతా అఫిడవిట్ ఇవ్వాల్సిందే! తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరుకాబోయే అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచన చేసింది. ఏ4 సైజులో హాల్‌టికెట్, ఫొటో, పేరు వివరాలన్నీ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. జూన్ 9న స్క్రీనింగ్ టెస్ట్ జరగనుంది. By srinivas 31 May 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి TGPSC: తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన జారీ చేసింది. గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యే వారంతా డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ మీద ఫొటో, పేరు వివరాలన్నీ రూల్స్ ప్రకారం తప్పనిసరిగా ఉండాలని, ఒకవేళ సరిగా లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా విద్యార్థి గతంలో చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలతోపాటు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచిన డిక్లరేషన్ ఫామ్ పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలని తెలిపింది. అలా అయితేనే పరీక్షకు అనుమతిస్తారిని, హాల్‌టికెట్ ఏ4 సైజులో ప్రింట్, పాస్‌పోర్టు ఫొటోను అతికించాని లేనిచో అభ్యర్థులను పరీక్ష హాల్ లోకి అనుమతించరని స్పష్టం చేసింది. తప్పుగా నమోదుచేస్తే డిక్లరేషన్ ఫామ్.. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిక్లరేషన్/అథంటికేషన్ (ఫామ్-1, ఫామ్-2)లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. పరీక్ష రాసేందుకు అప్లై చేసుకున్న అభ్యర్థులు వివరాలు తప్పుగా నమోదుచేస్తే డిక్లరేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుందని చెప్పింది. ఫొటోను సరిగా అప్లోడ్ చేయలేకపోయిన అభ్యర్థులు లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను డిక్లరేషన్ ఫామ్-1కు జతచేయాల్సి ఉంటుంది. పేరు తప్పుగా ఉన్న అభ్యర్థులు తమ పదోతరగతి లేదా డిగ్రీ సర్టిఫికేట్లో ఉన్న విధంగా పూర్తి పేరును డిక్లరేషన్ ఫామ్-2లో నమోదుచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్ లేదా అభ్యర్థులు చివరిగా చదివిన విద్యాసంస్థ ప్రిన్సిపల్ ద్వారా అటెస్టేషన్ తప్పనిసరి ఉండాలని తెలిపింది. జూన్ 1 నుంచి హాల్‌టికెట్లు.. 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లను జూన్ 1న విడుదల చేయనుంది. అధికారిక వెబ్సైట్లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనుంది. అభ్యర్థులు జూన్ 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి కమిషన్ వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. అభ్యర్థుల సౌకర్యం కోసం పరీక్షకు సంబంధించిన నియమ నిబంధనలు, OMR షీట్ నమూనాపత్రాలను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్ష కేంద్రాలు: ఆసిఫాబాద్-కొమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి-యాదాద్రి, జనగాం, మేడ్చల్-మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్. #tgpsc #group-1-exam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి