TGPSC Group-1 Key : గ్రూప్-1 ప్రైమరీ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!

లంగాణలో గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధంచిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. వెబ్‌ సైట్‌ లో మాస్టర్‌ ప్రశ్న పత్రంతో పాటు గా ప్రాథమిక కీ ని కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు

New Update
TGPSC Group-1 Key : గ్రూప్-1 ప్రైమరీ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!

TGPSC Group-1 : తెలంగాణ (Telangana) లో గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్ష (Group-1 Prelims Exam) కు సంబంధంచిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ (TGPSC) తాజాగా విడుదల చేసింది. వెబ్‌ సైట్‌ లో మాస్టర్‌ ప్రశ్న పత్రంతో పాటు గా ప్రాథమిక కీ ని కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు. ఆన్సర్ కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా జూన్ 17 వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు.

ప్రాథ‌మిక కీపై అభ్యంత‌రాల‌ను 13వ తేదీ నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు టీజీపీఎస్సీ దృష్టికి తీసుకుని రావొచ్చని అధికారులు తెలిపారు. దీనికోసం మొదట కమిషన్ వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్ ద్వారా వ్యక్తిగత వివరాలను ధృవీకరించాలి. ఆ తర్వాత అభ్యంత‌రాల‌ను ఇంగ్లీష్‌ లో ఎంటర్ చేయాలి. ఈ-మెయిల్, వ్యక్తిగత అభ్యర్థనలు, ఇతర పద్ధతుల్లో వచ్చే, గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంత‌రాల‌ను పరిగణనలోకి తీసుకోబోమని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ వివరించారు.

మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టులకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరందరికీ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం జరిగింది. అయితే వీరిలో 3.02 లక్షల (74 శాతం) అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే దాదాపు లక్ష మంది పరీక్షకు హాజరు కాలేదు. ఇక కమిషన్ బుధవారం మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్ పరీక్షలు ఉంటాయని పేర్కొంది.

Also read: అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు