TG JOBS : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలకు రంగం సిద్ధం!

తెలంగాణ నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ మరో శుభవార్త చెప్పారు. రానున్న 3 నెలల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిలోగా 90 వేల ఉద్యోగాలిస్తామని తెలిపారు.

New Update
TG JOBS : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలకు రంగం సిద్ధం!

CM Revanth : తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. రానున్న ఆరు నెలల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఆరు నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఏడాదిలోగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ముందుంటాం..
ఈమేరకు శుక్రవారం అగ్నిమాపక శాఖలో నేరుగా రిక్రూట్ అయిన ఫైర్‌మెన్‌ల నాలుగో బ్యాచ్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగా రిక్రూట్ అయిన ఫైర్‌మెన్‌లకు అభినందనలు తెలిపారు. శిక్షణ కాలంలో వారి కృషి, అంకితభావాన్ని మెచ్చుకున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న యువత ఆకాంక్షలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ఎత్తిచూపారు.

మా ప్రభుత్వం కట్టుబడి ఉంది..
'సమాజానికి సేవ చేసేందుకు ముందుకు వచ్చినందుకు మీ అందరినీ అభినందిస్తున్నా. ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ నిబద్ధతతోనే బడ్జెట్‌లో విద్య, వ్యవసాయానికి అత్యధిక నిధులు కేటాయించాం' అని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని, విశ్వాసం, భద్రతను పెంపొందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

ఇది కూడా చదవండి: BREAKING: ఏపీకి ఐపీఎస్‌ కేడర్‌ స్ట్రెంత్‌పై కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌

యువత నిరసనలు చేయొద్దు..
కొన్ని రిక్రూట్‌మెంట్ పరీక్షలను వాయిదా వేయాలని పిలుపునిస్తూ ఇటీవలి నిరసనలకు దిగిన వారిని ఉద్దేశిస్తూ.. యువత నిరసనలు చేయవద్దని, వారి సమస్యలపై నేరుగా మంత్రులతో చర్చించాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వాస్తవ సమస్యలను నిబద్ధతతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అన్ని శాఖల్లో నియామక ప్రక్రియను సక్రమంగా కొనసాగిస్తాం.. నిరుద్యోగ యువత తమ సమస్యలను ఎమ్మెల్యేలు, మంత్రులకు తెలియజేయాలని కోరుతున్నా అన్నారు. అందరి బాధలను తీర్చేందుకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని రేవంత్ రెడ్డి అన్నారు.

నియామకాల లిస్ట్..
అలాగే జనవరి 1న తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్ అయిన 6,956 మంది స్టాఫ్ నర్సులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశామన్నారు. ఫిబ్రవరి 14న తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్ అయిన 13,444 మంది కానిస్టేబుళ్లకు సీఎం నియామక పత్రాలు అందజేశాం. మార్చి 4న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ అయిన 5,192 మంది లెక్చరర్లకు సీఎం నియామక పత్రాలు అందజేశాం. ఫిబ్రవరి 19న TGPSC 563 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించాం. ఫిబ్రవరి 29న ప్రభుత్వ పాఠశాలల్లో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. 783 పోస్టుల భర్తీకి గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ పరీక్ష ఆగస్టు 7 -8 తేదీల్లో జరగాల్సి ఉండగా విద్యార్థుల అభ్యర్థనల మేరకు డిసెంబర్‌కు వాయిదా వేమన్నారు.

Advertisment
తాజా కథనాలు