TGPSC: గ్రూప్-2 అభ్యర్థులకు సువర్ణావకాశం.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫ్రీ ఆన్ లైన్ టెస్టులు!

గ్రూప్-2 పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. జులై 5-31 వరకూ బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఉచితంగా ఆన్‌లైన్‌ గ్రాండ్‌ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపింది. జులై 5వరకూ ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి.

New Update
TGPSC Group-1 Results : తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే!

TGPSC Group 2 Free Tests: తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు పరీక్షకు ముందు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. గ్రూప్‌-2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ (BC Study Circle) ఆధ్వర్యంలో ఉచితంగా ఆన్‌లైన్‌ గ్రాండ్‌ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 5 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ప్రతివారంలో రెండు రోజులు..
అలాగే జులైలో ప్రతివారంలో రెండు రోజులు గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. జులై 8, 9 తేదీల్లో మొదటి గ్రాండ్‌ టెస్ట్‌, జులై 15, 16 తేదీల్లో రెండో గ్రాండ్‌ టెస్ట్‌, జులై 22, 23 తేదీల్లో మూడో గ్రాండ్‌ టెస్ట్‌, జులై 30, 31 తేదీల్లో నాలుగో గ్రాండ్‌ టెస్ట్‌ నిర్వహించబోతున్నట్లు పేర్కొంది. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

అప్లికేషన్ లింక్: https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల (Group 2 Posts) భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) 2022-డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదలచేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు (Group2 Applications) దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది చొప్పున పోటీ పడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 2024, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు.

* పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు.
* పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు.
* పేపర్-3 (ఎకానమీ & డెవలప్‌మెంట్): 150 ప్రశ్నలు-150 మార్కులు.
* పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతారణ): 150 ప్రశ్నలు-150 మార్కులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు