TGPSC Group-1: గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయండి: ఆర్ఎస్పీ డిమాండ్!

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఒక పోస్టుకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలంటూ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలా చేస్తేనే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవంటూ పోస్ట్ పెట్టారు.

New Update
TGPSC Group-1: గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయండి: ఆర్ఎస్పీ డిమాండ్!

RS Praveen kumar: తెలంగాణలో అక్టోబర్ లో జరగనున్న మెయిన్స్ పరీక్షకు ఒక పోస్టుకు ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలంటూ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిన్న గ్రూప్ వన్ తెలంగాణ అభ్యర్థులను కలిసి వాళ్ల డిమాండ్ల పై చర్చించడం జరిగింది. అక్టోబర్ లో రానున్న మెయిన్స్ పరీక్షకు ఒక పోస్టుకు వంద మంది ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు (1:100) అవకాశమివ్వాలని వారి ప్రధాన మైన డిమాండు. ఈ డిమాండు ఆచరణ సాధ్యమైనదే. కేవలం CM గారు GAD నుండి ఒక మెమో TGPSC కి పంపించి, వారిని 1:50 ను 1:100 గా మారుస్తూ corrigendum లాంటిది విడుదల చేస్తే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవు. దీని వల్ల ప్రభుత్వానికి ఏలాంటి ఆర్థిక పరమైన నష్టం కూడా లేదు. డిప్యూటీ సీయం బట్టి గారు గత సం.లో అసెంబ్లీలో ప్రస్తావించిన వీడియోను ఇక్కడ అటాచ్ చేస్తున్న. @revanth_anumula గారు, కొంచెం టైం తీసుకొని కింది కారణాలను కూడా చదవండి. అని సూచించారు.

1. 13 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణలో వచ్చిన మొట్టమొదటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇది. దీనిపై వేలాది మంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు.

2. గత రెండు ప్రిలిమ్స్ పరీక్షల్లో క్వాలిఫై అయిన మెరిట్ అభ్యర్థులు , అవి రెండు రద్దు అవడం వల్ల మానసికంగా తీవ్రంగా కృంగిపోయి ఆందోళన కరమైన వాతావరణంలో మూడవసారి జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు అవడం జరిగింది.

3. గత కొన్ని సంవత్సరాల నుండి కేవలం గ్రూప్ వన్ కి మాత్రమే సిద్ధమవుతున్న అభ్యర్థులతో పాటు ,ఇతర పోటీ పరీక్షల అభ్యర్థులు సైతం ఎక్కువ మొత్తంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవడం వలన ఒక కృత్రిమ పోటీ వాతావరణం ప్రిలిమ్స్ పరీక్షలో పెరిగి నిజంగా మెయిన్స్ రాయగలిగిన సామర్థ్యం గల అభ్యర్థులు తము మెయిన్స్ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

4. 2011 అనంతరం 13 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఆశావాహుల సంఖ్య ఎక్కువ మొత్తంలో ఉండడము , చాలామంది సీనియర్ సిన్సియర్ అభ్యర్థులకి ఇదే చివరి అవకాశం కానుండడం వల్ల వారికి మెయిన్స్ కి అర్హత సాధించే అవకాశాలు పెంచాలి.

5. మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలో అభ్యర్థులని ఎంపిక చేయడం ఇది కొత్తేమీ కాదు . గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అభ్యర్థుల కోరిక మేరకు అప్పటి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలోఎంపిక చేశారు. There is a safe precedent here.

6. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్ లో 1:15 గా నోటిఫికేషన్ లో ఇచ్చినప్పటికీ తదనంతరం అభ్యర్థుల కోరిక మేరకు దానిని 1:100 గా మెయిన్స్ కి ఎంపిక చేశారు.

7. గ్రూప్ 1 పరీక్ష అనేది upsc మాదిరిగా ప్రతి సంవత్సరం పడక పోవడం, రాష్ట్ర స్థాయి సివిల్స్ పరీక్ష అవ్వడం, ఎక్కువ మంది ఆశవహులు ఉండటం వల్ల 1:100 నిష్పత్తి లొ మెయిన్స్ కి ఎంపిక చేయడం తెలంగాణ గ్రామీణ ప్రాంతం లోని విద్యార్థులకి తమ కలల ఉద్యోగం అయిన గ్రూప్ 1 ని సాధించే అవకాశాల సంఖ్య పెరుగుతుంది.

8. తెలంగాణ లొ ప్రస్తుతం 563 ఉద్యోగ ఖాళీలతో వచ్చిన ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది గత 50 సంవత్సరాలలొ అతి పెద్దది, మరియు ఇది దాదాపు ఒక సివిల్స్ నోటిఫికేషన్ కి సమానంగా ఉండటం వల్ల, లక్షల సంఖ్యలో గ్రామీణ అభ్యర్థులు, పోటీపడటం, అరుదు గా ఇలాంటి భారీ నోటిఫికేషన్ లు రావడం, తెలంగాణ ఉద్యమం సమయంలొ అప్పుడు తెలంగాణ కోసం గ్రూప్1 మెయిన్స్ పరీక్ష ని బహిష్కరణ చేసిన మన తెలంగాణ అభ్యర్థులకు ప్రస్తుత నోటిఫికేషన్ లొ అవకాశాల సంఖ్యను పెంచి, వారి త్యాగాలను గుర్తించి,వారికి న్యాయం చేయాలి.

పై అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని గతంలో ప్రతిపక్షంగా ఉండి 1:100 ని సమర్ధించిన ప్రస్తుతం అధికారం లో వున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని వేల మంది తెలంగాణ గ్రూప్ - 1 ఆశావహుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని మానవతా దృక్పథంతో 1:100 చొప్పున మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేస్తూ తెలంగాణలో అన్ని వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు గ్రూప్ 1 జాబులను సాధించే అవకాశాలను మరింత పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నం.

గమనిక:
'ఇక్కడ అభ్యర్థులు పరీక్షను వాయిదా వెయ్యమని అడగడం లేదు. ఎక్కువ మంది అర్హులకు మెయిన్స్ రాసే అవకాశం ఇవ్వమని మాత్రమే అడుగుతున్నారు' అంటూ ప్రవీణ్ కుమార్ రాసుకొచ్చారు. I think this is very much doable, CM garu. Please do justice to the unemployed youth of Telangana.

Advertisment
తాజా కథనాలు