Texas Wild Fire Live Updates : అమెరికా(America) లోని టెక్సాస్(Texas) లో కార్చిచ్చు కొనసాగుతోంది. టెక్సాస్ చరిత్రలోనే ఇది అతి పెద్ద అగ్నిప్రమాదంగా అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్లు నిర్ధారించారు. 500లకు పైగా ఇళ్లు కాలి బూడిదయ్యాయి. టెక్సాస్ అడవుల్లో 4400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అగ్నికి ఆహుతైంది. ఈ మంటలను ఇప్పటికీ కంట్రోల్‌లోకి రాలేదు. అగ్ని ప్రమాదం(Fire Accident) లో మరణించిన వారిలో ఒక మహిళను సిండిగా గుర్తించారు. టెక్సాస్‌లోని హెంఫిల్ కౌంటీ(Hemphill County) నుంచి మహిళ కారులో ఎక్కడికో వెళ్తున్నట్లు సమాచారం. ఈ సమయంలో ఆమె ఫైర్‌లో చిక్కుకున్నారు. మంటలు చెలరేగడంతో మహిళ తన కారులో నుంచి దిగారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మహిళ కాలిన స్థితిలో ఆస్పత్రిలో చేరగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
జంతువులు మృత్యువాత:
అగ్ని ప్రమాదంలో మరణించిన రెండో బాధితురాలు కూడా ఒక మహిళే. ఆమె పేరు జాయిస్ బ్లాంకెన్‌షిప్. ఆమె 83ఏళ్ల వృద్ధురాలు. జాయిస్ మనవడు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మంటలు ఇళ్లకు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. జాయిన్ తన ఇంటిలోనే సమాధైంది . ఈ మంటల కారణంగా పెద్ద సంఖ్యలో జంతువులు, వన్యప్రాణులు కూడా చనిపోయాయి.
కారణమేంటి?
ఫిబ్రవరి 29న సంభవించిన ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి టెక్సాస్ అటవీ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మంటలు ఇంకా తగ్గుముఖం పట్టలేదని టెన్షన్ పడుతున్నారు. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇప్పటివరకు స్పష్టతలేదు. బలమైన గాలులు, ఎండిన గడ్డి, వేడి వాతావరణం కారణంగా మంటలు ప్రారంభమైనట్లు అధికారులు భావిస్తున్నారు. బలమైన గాలుల కారణంగా మంటలు ఒక చోట నుంచి మరొక చోటకు వేగంగా వ్యాపించినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ టెక్సాస్‌లో అడవి మంటలు చెలరేగాయి. 2006లో టెక్సాస్ అడవులలో మంటలు వ్యాపించాయి. అప్పుడు 1,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కాలి బూడదైంది. నాటి ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read : పిఠాపురంలో వైసీపీ మాస్టర్ ప్లాన్