Cars Recall: 2లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా..కారణం ఇదే..!!

అమెరికన్ కార్ల తయారుదారీ సంస్థ టెస్లా అమెరికాలో దాదాపు 2లక్షల కార్లను రీకాల్ ప్రకటించింది. కారు రివర్స్ లో ఉన్నప్పుడు బ్యాకప్ కెమెరా పనిచేయడంలేదనే కారణంతో కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

New Update
Cars Recall: 2లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా..కారణం ఇదే..!!

Cars Recall: అమెరికాలో సుమారు రెండు లక్షల కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు టెస్లా (Tesla) ప్రకటించింది. సాంకేతిక సమస్య కారణంగా కారును రివర్స్ తీసే సమయంలో బ్యాకప్ కెమెరా(Backup camera) సరిగ్గా కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రీకాల్ ప్రకటించిన కార్లలో Y,S S2023 మోడల్స్ ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కంప్యూటర్ 4.0ను అమర్చారు. ఇది 2023. 44.3 సాఫ్ట్ వేర్ వెర్షన్ పై రన్న అవుతుంది. ఇప్పటివరకు ఈ లోపానికి సంబంధించి మాత్రం ఎలాంటి ప్రమాదం, మరణం సంభవించలేదని అమెరికా నేషనల్ హైవేస్ ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్టేషన్ కు టెస్లా తెలిపింది.

ఈ సమస్య ఉన్న మోడల్ వాహనాల యజమానులు ఇప్పటికే సంబంధిత సంస్థ నుంచి అలర్ట్స్ మార్చి 22 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. అయితే ఈ విషయంపై టెస్లాకు కస్టమర్ల నుంచి కంప్లెయింట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో సమస్యను గుర్తించిన కంపెనీ కార్ల రీకాల్ చేసింది. ఈ మధ్యే టెస్లా కార్లకు డిమాండ్ తగ్గిందన్న వార్తలు కూడా వచ్చాయి. చైనా కంపెనీ బీవైడి తన వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తున్న క్రమంలో టెస్లాపై ప్రభావం పడుతోంది. టెస్లా కంటే తక్కవ ధరకే అది ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే టెస్లా కూడా పలుమార్లు ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. అయినా కూడా నికర అమ్మకాలు గతం కంటే చాలా తగ్గాయని టెస్లా సీఈవో మస్క్ సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో జనవరి 25న టెస్లా షేర్లు ఏకంగా 12 శాతం పడిపోయాయి.

ఇది కూడా చదవండి: మోదీతో కలిసి” చాయ్” తాగడం మర్చిపోలేను ..!!

Advertisment
తాజా కథనాలు