పోలీస్ స్టేషన్ పై ఆత్మాహుతి దాడి.. 24 మంది మృతి

పాకిస్థాన్ ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మొత్తం 24 మంది మరణించగా 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ అధికారులే లక్ష్యంగా దాడికి పాల్పడ్డట్లు ఉగ్రవాద సంస్థ 'టీజేపీ' ప్రకటించింది.

పోలీస్ స్టేషన్ పై ఆత్మాహుతి దాడి.. 24 మంది మృతి
New Update

Pakistan: పాకిస్థాన్ లో ఘోరం జరిగింది. పోలీస్ స్టేషన్ పై ఆత్మహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాదులు 24 మందిని పొట్టనపెటుకున్నారు. దక్షిణ వజీరిస్తాన్ గిరిజన జిల్లా సరిహద్దులోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న దర్బన్ పోలీస్ స్టేషన్‌పై ఈ దాడి జరగగా ఈ భయానక సంఘటన ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.

ఈ మేరకు మంగళవారం తెల్లవారు జామున ఉగ్రవాదులు పేలుడు పదార్దాలతో నిండిన వాహనంతో పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి, అక్కడ ఆ వాహనాన్ని పేల్చేసినట్లు స్థానికులు చెప్పారు. ఉగ్రవాదులు మొదట పేలుడు పదార్ధాలున్న వాహనంతో పోలీస్ స్టేషన్ భవనంలోకి వచ్చి ఢీకొట్టారు. అనంతరం మోర్టార్ బాంబులతో దాడి చేశారు. ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో కనీసం ఆరుగురు భద్రతా సిబ్బందితో సహా మొత్తం 24 మంది మరణించారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో చాలా మంది సివిల్ డ్రెస్ లో ఉండడంతో వారు ఎవరనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. వారు పాకిస్తాన్ మిలటరీ సిబ్బంది అని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడిలో పోలీస్ స్టేషన్ భవనం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ కొన్ని గంటల పాటు కొనసాగింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరు తప్పించుకుని పారిపోయారు. వారికోసం పోలీసులు సమీప ప్రాంతాల్లో గాలింపు ప్రారంభించినట్లు సమాచారం.

Also read : TSPSC: గ్రూప్ 2 రీషెడ్యూల్!.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు

ఇక ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణం ఉగ్రవాదులకు కంచుకోటగా మారుతోంది. ఇది అఫ్గానిస్తాన్ కు సమీపంలో ఉండడం వారికి కలిసి వస్తోంది. గతంలో ఇక్కడ ఉగ్రవాద సంస్థ ‘‘తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ (TTP)’’ బలంగా ఉండేది. ఇటీవల ఇక్కడ ‘‘తెహ్రీక్ ఇ జహీద్ పాకిస్తాన్ (Tehreek-e-Jihad Pakistan TJP)’’ పేరుతో మరో ఉగ్రవాద సంస్థ ప్రారంభమైంది. ఈ రోజు పోలీస్ స్టేషన్ పై దాడి చేసింది తామేనని ఈ టీజేపీ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆ పోలీస్ స్టేషన్ లోని అధికారులు లక్ష్యంగా ఈ దాడి చేశామని ప్రకటించింది. ఈ జనవరి నెలలో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోని ఒక మసీదులో జరిగిన ఒక ఉగ్రదాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

#police-station #pakistan #terrorist
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe