/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-7-7.jpg)
Amarnath yatra: అమర్‌నాథ్ యాత్ర 2024 జూన్ 29 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అమర్‌నాథ్ యాత్రకు ఉగ్రముప్పు పొంచి ఉందన్న ఇంటలిజెన్స్ సమాచారంతో భారీగా బందోబస్తు కల్పించాలని నిర్ణయించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ సారథ్యంలో.. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతను వేగవంతం చేయడంతో పాటు అదనపు బలగాలను రంగంలోకి దించాలని డెషిషన్ ఫైనల్ అయింది. ఇక 19 ఆగస్టు 2024న అమర్ నాథ్ యాత్రం ముగుస్తుంది. అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం దక్షిణ కాశ్మీర్ హిమాలయాలలో సముద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో ఉంది. పవిత్ర యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) ఇటీవలే ప్రకటించింది.