ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రేయాన్ష్ కొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస అయ్యాడు. దీంతో ఆతడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం పీయస్ పరిధిలోని మైహోమ్ భూజాలోఈ ఘటన చోటుచేసుకుంది. మైహోమ్ భూజా జే బ్లాక్‌పై నుంచి దూకి విద్యార్థి రేయాన్ష్‌రెడ్డి (14) ఆత్మహత్య చేసుకోవటంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దీంతో అందరు ఒక్కసారిగా ఆందోళనకు గురి అయ్యారు. ఆన్ లైన్ గేమ్స్‌కు బానిస కావడంతో పాటు.. చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒత్తిడి భరించలేక
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన విద్యార్థి.. చదువును కూడా నిర్లక్ష్యం చేశాడు. అయితే అది పోనుపోను అతనిని ఆందోళనకు గురిచేసింది. ఒత్తిడి భరించలేక చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రేయాన్ష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస కావడమా..? చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎలా బతుకుతావంటూ
అయితే గతంలో కూడా ఆన్‌లైన్ గేమ్స్ ఓ విద్యార్థి ప్రాణాలను బలి అయ్యాడు. సంతోష్‌కుమార్(20) డిగ్రీ చదువుతూ ఆన్‌లైన్ గేమ్‌లకు బానిస అయ్యాడు. ఇంటివద్దే ఉంటూ ఆన్‌లైన్ వీడియో గేమ్‌లు ఆడేవాడు. చదువులు మానేసి ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతూ కూర్చొంటే ఎలా బతుకుతావంటూ తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన సంతోష్ పురుగుమందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా.. పరిస్థితి విషమించి సంతోష్ మృతిచెందాడు. ఈ ఘటన మార్చి 29న అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం గుట్టకిందపల్లిలో చోటుచేసుకుంది.
అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక
అయితే మనదేశంలో పబ్‌జీ వంటి ఆన్‌లైన్ గేమ్స్‌కి యువత బాగా అలవాటుపడి బానిసలాగా మారారు. అందువల్ల మానసిక సమస్యలను చాలా మంది యువత ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది ఈ ఆన్‌లైన్ గేమ్స్‌తో ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా రేయాన్ష్‌రెడ్డి ఆన్‌లైన్ ఆటలకు బానిసై ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాదు మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. జితేంద్ర వసాకల్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కంప్యూటర్ అప్లికేషన్లోలో పీజీ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాలై వాటికి బానిస అయ్యాడు. అంతేకాదు ఈ ఆన్‌లైన్ ఆటల కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. అప్పులు ఎక్కువవడం, తిరిగి డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. దీంతో చేసేంది లేక ఆత్మహత్య చేసుకున్నాడు.