నాగార్జున సాగర్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత..ఏపీ వర్సెస్ తెలంగాణ.!

నాగార్జున సాగర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇప్పటికే 13 గేట్లు స్వాధీనం చేసుకున్న ఏపీ అధికారులు.. కుడి కాలువ నుంచి నీరు వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..అయితే, మోటార్లకు కరెంట్ నిలిపివేశారు తెలంగాణ అధికారులు.

New Update
నాగార్జున సాగర్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత..ఏపీ వర్సెస్ తెలంగాణ.!

అసలేం జరిగిందంటే..? గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు చొరబడి నాగార్జునసాగర్ డ్యామ్‌కు ముళ్లకంచె ఏర్పాటు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాగార్జునసాగర్ డ్యామ్‌ ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్ వరకు తమ పరిధిలోకి వస్తుందని చెబుతూ 500 మంది పోలీసులతో కలిసి వచ్చిన ఆ శాఖ ఉన్నతాధికారులు తమను అడ్డుకున్న డ్యామ్ సిబ్బందిపై దాడిచేశారు. వారి మొబైల్ ఫోన్లతోపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం 13వ గేట్ వరకు ముళ్లకంచె ఏర్పాటు చేసి డ్యామ్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు.

సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్‌ వద్దకు చేరుకుని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్ నిర్వహణ విషయం నీటిపారుదల అధికారులకు సంబంధించిన విషయమని, ముళ్లకంచెను తీసేయాలని సూచించారు. అయితే, వారు స్పందించకపోవడంతో చేసేది లేక వెనక్కి వెళ్లిపోయారు. రాష్ట్ర విభజన సమయంలో నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది.

Also Read: ఓటు వేయడానికి తరలివస్తున్న ప్రముఖులు, రాజకీయ నాయకులు

Advertisment
Advertisment
తాజా కథనాలు