India vs New Zealand: సెమీస్ లో న్యూజీలాండ్ పై ప్రతీకారం తీర్చుకుంటుందా?

ప్రపంచ కప్ 2023 సెమీస్ లో భారత్ న్యూజీలాండ్ తో తలపడబోతోంది. ఈ పోరులో భారత్ గెలిచి గత వరల్డ్ కప్ సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా అనే ఉత్కంఠ రేగుతోంది.

New Update
World Cup 2023: ఈరోజు మ్యాచ్‌లో టాసే హీరోనా? వాంఖడే రికార్డులు ఏం చెబుతున్నాయి?

India vs New Zealand: శ్రీలంకపై భారీ విజయంతో న్యూజిలాండ్  వన్డే ప్రపంచకప్ (World Cup 2023 Semifinal) సెమీఫైనల్స్‌లో తన స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. ఆ జట్టు గురువారం శ్రీలంకను 23.2 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో ఓడించి, పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్తాన్ కంటే తన రన్ రేట్‌ను చాలా ఎక్కువ చేసుకోగలిగింది. 

న్యూజిలాండ్‌ విజయంతో తొలి సెమీఫైనల్‌లో కివీస్‌తో భారత్‌ తలపడుతుందని కూడా తేలిపోయింది. నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది.

Also Read: అతను క్రికెట్‌కు దక్కిన గొప్ప క్రీడాకారుడు.. విరాట్ పై వివ్ రిచర్డ్స్

న్యూజీలాండ్ ఎలా సెమీస్ అర్హత సాధించింది?
న్యూజిలాండ్ శ్రీలంకను  ఓడించి దాని రన్ రేట్‌ను +0.743కి పెంచుకుంది. నాకౌట్ రేసులో పాకిస్థాన్ రన్ రేట్ +0.036 - ఆఫ్ఘనిస్తాన్ రన్ రేట్ -0.338. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌ 287 పరుగుల తేడాతో గెలిస్తే లేదా ఆఫ్ఘనిస్థాన్‌ 438 పరుగుల తేడాతో గెలిస్తేనే సెమీఫైనల్‌కు చేరుకోగలుగుతుంది. ఇంగ్లండ్‌తో పాకిస్థాన్‌ మ్యాచ్‌, దక్షిణాఫ్రికాతో ఆఫ్ఘనిస్థాన్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. రెండు జట్లు చరిత్రలో ఇంత పెద్ద తేడాతో ఎప్పుడూ గెలిచినా చరిత్ర లేదు. పైగా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అది సాధ్యమయ్యే లక్ష్యం కాదు. కాబట్టి సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్ ఆడడం అనేది ఆట 99% గ్యారెంటీగా మారింది. అంటే అన్ని లెక్కలూ చూస్తే కేవలం ఒక్క శాతం మాత్రమే అద్భుతం జరిగే అవకాశం ఉంది. 

వన్డే ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్(India vs Newzealand) వరుసగా రెండోసారి సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. అంతకుముందు 2019లో కూడా ఈ రెండు జట్ల మధ్య టోర్నీలో తొలి సెమీఫైనల్ జరిగింది. అప్పుడు కూడా భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్ నంబర్-4లో ఉంది, ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. 2019లో మాంచెస్టర్ మైదానంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

నంబర్-2 -నంబర్-3 ప్లేస్ లలో ఉండడం వలన సౌతాఫ్రికా - ఆస్ట్రేలియా 12-12 పాయింట్లతో ఉన్నాయి. అందువల్ల కచ్చితంగా ఇప్పుడు నాలుగో స్థానంలో న్యూజిలాండ్    ఉంటుంది.  న్యూజిలాండ్‌కు 10 పాయింట్లు ఉన్నాయి. దాని అన్ని మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. అందువల్ల ఇప్పుడు జట్టు 12 పాయింట్లకు చేరుకుని టాప్-3 స్థానానికి వచ్చే ఛాన్స్ ఏమీలేదు. ఇక నవంబర్ 16న కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య సెమీ ఫైనల్ 2 జరగనుంది.

Also Read: World Cup 2023: శ్రీలంకపై కివీస్ భారీ విజయం..రన్ రేట్లోనూ..!!

మొత్తమ్మీద చూసుకుంటే, ఐసీసీ (ICC) నాకౌట్‌లో భారత్, న్యూజిలాండ్(India vs New zealand) జట్లు నాలుగోసారి తలపడనున్నాయి . దీనికి ముందు, రెండు జట్లు వేర్వేరు టోర్నమెంట్‌ల నాకౌట్‌లలో మూడుసార్లు తలపడ్డాయి.  ప్రతిసారీ న్యూజిలాండ్ గెలిచింది. 2019 ప్రపంచ కప్‌తో (World Cup) పాటు, ఈ రెండు టీములూ 2000 ఛాంపియన్స్ ట్రోఫీ, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో కూడా తలపడ్డాయి. 

ఆతిథ్య భారత్‌ సెమీఫైనల్‌కు చేరితే, తమ మ్యాచ్‌ ముంబైలోనే ఉంటుందని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టోర్నీ ప్రారంభానికి ముందే స్పష్టం చేసింది. భారత్ తొలిసారిగా నాకౌట్‌కు చేరుకుంది. అందుకే వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఒకవేళ వర్షం లేదా మరేదైనా కారణాల వల్ల నవంబర్ 15న సెమీఫైనల్ జరగకపోతే, రిజర్వ్ డే రోజున నవంబర్ 16న మ్యాచ్ జరగనుంది. ఈ రోజు కూడా ఫలితం సాధించకపోతే, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌ను విజేతగా పరిగణిస్తారు.

వన్డేల్లో గట్టి పోటీ నెలకొని ఉంది.

క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో భారత్, న్యూజిలాండ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. వన్డేల్లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 109 మ్యాచ్‌లు జరిగాయి. న్యూజిలాండ్ 50, భారత్ 59 గెలిచాయి. 7 మ్యాచ్‌లు అసంపూర్తిగా ఉన్నాయి.  ఒక మ్యాచ్ టై అయింది.

మొత్తమ్మీద చూసుకుంటే న్యూజీలాండ్ తో సెమీస్ భారత్ కు అంత ఈజీ కాదని చెప్పవచ్చు. ప్రస్తుత భారత్ ఫామ్ ముందు ఏ జట్టూ నిలిచే పరిస్థితి లేదనే విషయమూ స్పష్టమైంది. కానీ, నాకౌట్ దశలో ఉండే ఒత్తిడిని ఏ టీమ్ సమర్ధంగా ఎదుర్కోగలదు అనే దానిపైనే ఈ మ్యాచ్ లో విజేతను నిర్ణయిస్తుంది. ఏదిఏమైనా ఉత్కంఠ భరితమైన పోరు కచ్చితంగా జరిగే అవకాశం ఉంది. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు