Sania Mirza-Shoaib Malik News: సానియా మీర్జా... ఒకప్పుడు టెన్నిస్ ప్రపంచంలో సంచలనం. తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్. సానియా మీర్జాని చూసి ఎంతోమంది అమ్మాయిలు టెన్నిస్ రాకెట్ పట్టారు. అలా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది సానియా. వృత్తిపరంగా ఆమెకు తిరుగులేకున్నా.. వైవాహిక జీవితం మాత్రం ఎన్నో బాధల మధ్య సాగింది. ఏ మతంలో అయినా వివాహాలు గ్యారంటీగా నూరేళ్లు నిలుస్తాయని చెప్పలేము. 2010లో సానియా మీర్జా - షోయబ్ మాలిక్ పెళ్లి ఎంత హడావుడి సృష్టించిందో చెప్పలేం. అప్పటికే పెళ్లయి, విడాకులు తీసుకున్న షోయబ్‌ని ఏరికోరి మరీ పెళ్లి చేసుకుంది ఈ టెన్నిస్ స్టార్. వీళ్లిద్దరికీ ఇప్పుడు నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. సీన్ కట్ చేస్తే షోయబ్ మాలిక్, పాక్ నటి సనా జావెద్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇది అతను మూడో పెళ్లి.
హైదరాబాద్ చుట్టూనే మాలిక్ పెళ్లిళ్లు:
షోయబ్ మాలిక్ మొదటి వివాహం... ఆయేషా సిద్దిఖీ అనే హైదరాబాదీ అమ్మాయితో జరిగింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ... నాలుగేళ్లలోనే ఆమెకి విడాకులిచ్చి సానియా మీర్జాని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరు కూడా విడిపోతారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే సానియా మీర్జా పెట్టిన ఓ పోస్ట్ కూడా వైరల్‌గా మారింది. పెళ్లి కష్టం, విడాకులూ కష్టమే... రెండింటిలో ఏ కష్టాన్ని ఎంచుకోవాలో మనమే నిర్ణయంచుకోవాలి అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది సానియా. అంటే షోయబ్ మాలిక్ మూడో పెళ్లి గురించి ఆమెకి ముందే తెలిసి ఆ పోస్ట్ పెట్టిందేమో అంటున్నారు కొంతమంది. మరోవైపు సానియా ఇప్పటికే షోయబ్ మాలిక్‌కి విడాకులు ఇచ్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మేరకు సానియా తండ్రి ఇమ్రాన్ స్పందించారు. తన కుమార్తె ఇప్పటికే విడాకులు ఇచ్చేసింది అనే అర్ధం వచ్చేలా ఆయన మాట్లాడారు. అయితే సానియా మీర్జా కూడా మరో వివాహం చేసుకుంటుందా అనే దానిపై మాత్రం ఇమ్రాన్ మీర్జా నుంచి ఏ సమాధానం రాలేదు.
ఇక షోయబ్ మాలిక్ మూడో పెళ్లిలో మరో ట్విస్ట్ కూడా ఉంది. షోయబ్ తొలి వివాహం చేసుకున్న ఆయేషా సిద్దిఖీది హైదరాబాదే. రెండో భార్య సానియాదీ హైదరాబాదే. ఇక ఇప్పుడు మనువాడిన సనా జావెద్‌ది కూడా హైదరాబాదే అట. ఆమె పూర్వీకులు హైదరాబాద్‌కి చెందినవాళ్లే. దేశవిభజన సమయంలో ఇక్కడి నుంచి వెళ్లి పాకిస్తాన్‌లో స్థిరపడ్డారట. మొత్తం షోయబ్ మాలిక్ మూడు పెళ్లిళ్లకీ హైదరాబాద్‌తో లింక్ ఉందనేదే కొత్త ట్విస్ట్.
Also Read: షోయబ్ మాలిక్‌ని పెళ్లాడిన సనా ఎవరు?