ISRO NRSC Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పలు విభాగాల్లో మొత్తం 54 టెక్నీషియన్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కొలువుల కోసం https://www.nrsc.gov.in/ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు:
మొత్తం పోస్టులు: 54
టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్, మెకానిక్): 33 పోస్టులు
ఎలక్ట్రికల్: 8 పోస్టులు
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 9 పోస్టులు
ఫొటోగ్రఫీ, డీటీపీ ఆపరేటర్ : 2 పోస్టులు
విద్యార్హత:
అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం:
లెవెల్ -3 పే కింద నెలకు రూ.21,700- రూ.69,100 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తులు:
డిసెంబర్ 31 సాయంత్రం 5గంటల వరకు చేయవచ్చు. ఈ ఉద్యోగాలు తాత్కాలికమైనవే.. కానీ కొనసాగించే అవకాశాలు ఉంటాయి.
వయో పరిమితి:
అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 31 నాటికి 18 నుంచి 35సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST/BC/OBCలకు 3ఏళ్ల చొప్పున వయో పరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
రూ.100. అయితే, ప్రాసెసింగ్ ఫీజు కింద మరో రూ.500లు చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు తర్వాత ఈ మొత్తాన్ని రిఫండ్ చేస్తారు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష (సీబీటీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో 80 ప్రశ్నలు అడుగుతారు. 1.50గంటల పాటు ఈ పరీక్ష ఉంటుంది. తప్పు సమాధానం రాస్తే 0.33 మార్కులు కోత విధిస్తారు. స్కిల్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో తుది జాబితా ఆధారంగా స్కిల్ టెస్ట్‌కు సెలక్ట్ చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే:
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, కరీంనగర్.