Kedarnath Yatra: కేదార్‌నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్

కేదార్‌నాథ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. కొండచరియలు విరిగిపడి 18 మంది గల్లంతయ్యారు. 16 వందల మంది యాత్రికులు కేదార్‌నాథ్‌లో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Kedarnath Yatra: కేదార్‌నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్
New Update

Kedarnath Yatra : కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. కొండచరియలు (Landslides) విరిగిపడి 18 మంది గల్లంతయ్యారు. కేదార్‌నాథ్‌ (Kedarnath) లో 16 వందల మంది యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలకు (Heavy Rains) కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గౌరీకుండ్‌ - కేదార్‌నాథ్‌ దారిలో భక్తులు చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు 3 వేల మందిని రెస్క్యూ టీమ్స్‌ రక్షించాయి. గల్లంతైన వారికోసం హెలికాప్టర్లు, డోన్లతో సహాయక బృందాలు గాలిస్తున్నాయి. హరిద్వార్‌, తెహ్రీ, డెహ్రాడూన్‌, చమోలీ జిల్లాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తాయి.

Also Read : జాబ్ లెస్ క్యాలెండర్ గురించి వివరణ ఇవ్వండి.. రాహుల్‌కు కేటీఆర్ ట్వీట్

#heavy-rains #landslides #kedarnath-yatra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe