Temperatures : రాష్ట్రంలో భానుడు(Sun) నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఎండ తీవ్రత(Heat Waves) తకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 46 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. అంతేకాదు అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి. మరో 3,4 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ(Department Of Meteorology) అంచనా వేసింది. ఇక పగటిపూట ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో ఏడుగురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: కేసీఆర్ కుటుంబం జైలుకే.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
మరోవైపు శనివారం రాష్ట్రంలోని పలు మండలాల్లో తీవ్ర వడగాలులు(Hailstorm) వీచినట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్టులు కూడా కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
Also Read: ఏపీలో అధికారం ఎవరిదో చెప్పేసిన RTV.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?