ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నారు. 2014 నుండి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆశా వర్కర్ల జీతాలను రూ. 10 వేలకు పెంచిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న సీపీఎస్ ను రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీపీఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. సీపీఎస్ కు బదులుగా జీపీఎస్ ను తీసుకు వస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించంది. అయితే జీపీఎస్ ను కూడ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నారు.జీపీఎస్ వల్ల కూడ ఉద్యోగులకు ప్రయోజనం దక్కదని కొన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే కొన్ని ఉద్యోగ సంఘాలు జీపీఎస్ ను స్వాగతిస్తున్నాయి.
Also Read: లోకేష్ ఎప్పుడైనా అలా చేశావా?: మంత్రి రోజా సంచలన వాఖ్యలు