AP Assembly Updates: కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. కీలక బిల్లులకు ఆమోదం! ఏపీ కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ అసెంబ్లీలో నేడు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించే బిల్లుకు ఆమోదముద్ర వేసింది. అనంతరం జీపీఎస్ బిల్లును ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. By Jyoshna Sappogula 27 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి GPS Bill in AP Assembly: ఏపీ కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్(CM jagan) సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ అసెంబ్లీ(AP Assembly)లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించే బిల్లుకు ఆమోదముద్ర వేసింది. అనంతరం జీపీఎస్ బిల్లును (GPS Bill) ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Buggana Rajendranath) ఈ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.జీపీఎస్ అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాపై రూ. 2500 కోట్ల భారం పడే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నారు. 2014 నుండి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆశా వర్కర్ల జీతాలను రూ. 10 వేలకు పెంచిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న సీపీఎస్ ను రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీపీఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. సీపీఎస్ కు బదులుగా జీపీఎస్ ను తీసుకు వస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించంది. అయితే జీపీఎస్ ను కూడ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నారు.జీపీఎస్ వల్ల కూడ ఉద్యోగులకు ప్రయోజనం దక్కదని కొన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే కొన్ని ఉద్యోగ సంఘాలు జీపీఎస్ ను స్వాగతిస్తున్నాయి. Also Read: లోకేష్ ఎప్పుడైనా అలా చేశావా?: మంత్రి రోజా సంచలన వాఖ్యలు #ap-cm-jagan #contract-employees #ap-governmant #gps-bill-in-ap-assembly #ap-gps-bill మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి