tirumala: వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..నేడు రథోత్సవం

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవం నిర్వహిస్తున్నారు. మహారథంపై మాడవీధుల్లో మలయప్పస్వామి విహరిస్తున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనసేవ స్వామి విహరిస్తారు.

New Update
tirumala: నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు..చక్రస్నానం ప్రత్యేకతలు తెలుసా..!!

కలియుగ దైవంగా భక్తులు నమ్మి కొలిచే ఏడుకొండల వాడైన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండవగా కొనసాగుతున్నాయి. రేపటి వరకు సాగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి తెల్లవారు జాము పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం (నేడు) స్వామివారి రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 6.55 గంట‌ల‌కు ర‌థోత్సవం ప్రారంభం కానుండగా.. ఈ రథోత్సవంలో స్వామివారు భక్తులను కాటక్షించనున్నారు. తిరుమల మాడ వీధుల్లో సాగనున్న ఈ సేవలో.. స్వామివారి భక్తులు పాల్గొనడానికి ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. మాడవీధుల్లో మలయప్పస్వామి మహారథంపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు.

గోవిందా గోవిందా నామాలతో..

కాగా.. ఉదయం స్వామివారి రథోత్సవంతో పాటు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనసేవ నిర్వహించనున్నారు. ఈ సేవ ద్వారా స్వామివారు కృప కటాక్షలను అందించనున్నారని భక్తుల విశ్వ నమ్మకం. స్వామివారి బ్రహ్మోత్సవాలు అంటే వెంకటేశ్వరస్వామి భక్తులకు ఎనలేని ప్రతి. మరోవైపు రథోత్సవం తిరుమాఢ వీధుల్లో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ ఉత్సవానికి భారీ ఎత్తున భక్తులు తరలిరావడంతో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు తిరుమలలో శ్రీవారి నామస్మరణతో.. గోవిందా గోవిందా నామాలతో తిరుమాఢ వీధులు మార్మోగుతున్నాయి. ఆ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో భక్తులు భారీగా శ్రీవారి సన్నిధికి పోటెత్తుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.

చివరికి దశకు

ఉదయం స్వామివారు సూర్యమండల మధ్యస్తుడై హిరణ్మయ స్వరూపడిగా రామకృష్ణ గోవింద అలంకారంలో భక్తులను కటాక్షించారు. శంఖుచక్రాలు, కత్తి, విల్లు, బాణం, వరద హస్తంతో భక్తులకు సూర్యప్రభ వాహనంపై నుంచి అనుగ్రహించారు. మరోవైపు సోమవారం బ్రహ్మోత్సవాలు చివరికి దశకు చేరుకోనున్నాయి. సోమవారం ఉదయం రథోత్సవం, రాత్రి. 7 గంటలకు అశ్వవాహన సేవతో స్వామివారి వాహన సేవలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్‌స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి దంతపలు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

చల్లని వెన్నెల్లో చంద్రప్రభ వాహనంపై

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న ఏడోరోజున సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగిన్నాడు. రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు.. నవనీత కృష్ణుడి అలంకారంతో విశేష తిరువాభరణాలు ధరించి స్వామివారు చల్లని వెన్నెల్లో చంద్రప్రభ వాహనంపై విహరించారు. స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు స్వామివారికి కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. అయితే వాహనసేవ ముందు కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు