cinema: రేపే పెదకాపు ట్రయిలర్ రిలీజ్

విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న సినిమా పెదకాపు-1. సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకుడు. న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ఇది. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

New Update

ఈ సినిమా ప్రచారం సక్సెస్ ఫుల్‌గా మొదలైంది. లిరికల్ వీడియోస్‌లో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ మంచి అంచనాలను నెలకొల్పింది. ఇప్పుడు, మేకర్స్ ఈ చిత్రం ట్రైలర్ డేడ్‌కి సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు. పెదకాపు-1 ట్రయిలర్‌ను రేపు రిలీజ్ చేయబోతున్నారు.

publive-image

పెదకాపు-1 అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే పొలిటికల్ థ్రిల్లర్. టీజర్‌లో ఈ విషయాన్ని ఇదివరకే వెల్లడించారు. రేపు రిలీజ్ కాబోతున్న ట్రైలర్‌లో సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుస్తాయి.

publive-image

ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ఇండియన్ లీడింగ్ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ ఫైట్స్‌ను పర్యవేక్షిస్తున్నాడు. రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, అనుసూయ, ఈశ్వరి రావు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను సెప్టెంబర్ 29న విడుదల చేయబోతున్నారు.

Advertisment
తాజా కథనాలు