Fish Benefits: సముద్ర చేపలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు.. తప్పక తెలుసుకోండి!

స‌ముద్ర చేప‌ల‌ను చిన్నారులు, పెద్దలు తినడం వ‌ల్ల వారి ఎముక‌లు స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలాగే భ‌విష్యత్తులో ఆర్థరైటిస్‌ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రుమ‌టాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు స‌ముద్రపు చేప‌ల‌ను తింటే ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Fish Benefits: సముద్ర చేపలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు.. తప్పక తెలుసుకోండి!
New Update

Sea Fish Benefits: స‌ముద్ర తీర ప్రాంతం లేని అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంట‌ల్లో పెరిగే చేప‌ల‌ను తింటారు. కానీ వాటి క‌న్నా స‌ముద్ర చేప‌ల్లో ఎక్కువ పోష‌కాలు ఉంటాయని హెల్త్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ చేప‌లను త‌ర‌చూ తీసుకుంటే రుచితో పాటు..ఎక్కువ పోష‌కాలు మ‌న‌కు అంద‌జేస్తాయి. అలాగే అనారోగ్య స‌మ‌స్యలు దూరం అవుతాయి. స‌ముద్రపు చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.
సముద్రపు చేపలను తింటే కలిగే ప్రయోజనాలు:
1. మెదడు ప‌నితీరు, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. స‌ముద్రపు చేప‌ల‌ను తింటే చిన్నారులు, యవతకి మెద‌డు ప‌నితీరు మెరుగుప‌డి..చాలా యాక్టివ్‌గా ప‌నిచేస్తుంది. అలాగే జ్ఞాప‌క‌శ‌క్తి పెరగటంతో పాటు పెద్దలకు వ‌చ్చే అల్జీమ‌ర్స్ వ్యాధి రాదు.
2. రోగ నిరోధ‌క శ‌క్తి: మ‌న శ‌రీరంలో రోగనిరోధ‌క వ్యవ‌స్థ మెరుగ్గా ప‌నిచేయాలంటే జింక్ అనే పోష‌క అవసరం. స‌ముద్రపు చేప‌ల‌తోపాటు న‌త్తలు, పీత‌లు, రొయ్యల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది.  అందుకే ఈ ఆహారాల‌ను రోజూ తింటే జింక్ అధికంగా అంది రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చేపల్లో ఉండే విట‌మిన్-ఏ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, సెలీనియం మ‌న శ‌రీరంలోకి చేరే సూక్ష్మ క్రిముల‌ను నాశ‌నం చేస్తాయి.
3. గుండె ఆరోగ్యానికి: చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వారంలో ఒక స‌ముద్రపు చేప‌ల‌ను తింటే హార్ట్ ఎటాక్‌లు, ఇత‌ర గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌ని ప‌రిశోధ‌న‌లో తెలింది.
4. చ‌ర్మ సంర‌క్షణ‌: స‌ముద్రపు చేప‌ల‌ను తింటే పోష‌కాలు చ‌ర్మానికి సంర‌క్షణ‌ను అందిస్తాయి. సముద్రపు చేప‌ల‌ను తింటే మొటిమ‌లు, చ‌ర్మ స‌మ‌స్యలు కూడా తగ్గుతాయి.
Also Read: ఈ చిట్కాలతో ఒత్తిడి తగ్గుతుంది.. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది!
5. కంటి ఆరోగ్యానికి: స‌ముద్రపు చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కంటి ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తాయి. అంతేకాదు వృద్ధులకు కంటి చూపు త‌గ్గే స‌మ‌స్య నుంచి బ‌య‌టప‌డ‌వ‌చ్చు. ప్రధానంగా రేచీకటి తగ్గి, కంటి ఆరోగ్యం మంచిగా ఉంటుంది.
6. డిప్రెష‌న్: చాలామంది నిత్యం అనేక సంద‌ర్భాల్లో అనేక ర‌కాలుగా ఒత్తిడితో ఉంటారు. అయితే.. స‌ముద్ర చేప‌ల‌ను ఆహారంలో తింటే ఒత్తిడి, డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు.
7.ఆర్థరైటిస్: స‌ముద్రపు చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆర్థరైటిస్‌ను త‌గ్గిస్తాయి. శ‌రీరంలో వాపులు, కీళ్లలో దృఢత్వాన్ని త‌గ్గిస్తాయి. స‌ముద్రపు చేప‌ల్లో విట‌మిన్-డి మ‌న శ‌రీరం కాల్షియాన్ని ఎక్కువ‌గా శోషించుకునేలా చేస్తుంది. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి.
Also Read: కొబ్బరి లస్సీ ఎలా చేస్తారు.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

#health-benefits #sea-fish
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe