Health Tips: గేదె, ఆవు పాలల్లో ఏవి బెటరంటే...!! ఆవు పాలు, గేదె పాలల్లో ఏది బెటర్ అన్నదానిపై చాలా మందిలో అనేక సందేహాలు ఉంటాయి. ఒక గ్లాస్ గేదె పాలల్లో 237 కేలరీలు ఉంటాయని.. అదే ఆవు పాలల్లో 148 కేలరీలే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఆవుపాల కంటే గేదె పాలు చాలా చిక్కగా ఉంటాయంటున్నారు. బాగా నిద్రపట్టాలంటే రాత్రి సమయంలో గేదె పాలు తాగితే బెటర్. By Vijaya Nimma 29 Oct 2023 in లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి పాలల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ డీ, కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఎముకలు, పళ్లను ధృడంగా చేయడానికి ఇవి ఎంతో సహాయపడుతుంది. అందుకే నిత్యం పాలు తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. అసలు మన ఆరోగ్యానికి ఏ పాలు మంచివి? అన్నదానిపై చాలా మందికి డౌట్స్ ఉంటాయి. గేదె లేదా ఆవు.. ఏ పాలల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయన్న దానిపై సందేహాలు ఉంటాయి. పాలలోని కొవ్వుతోనే వాటి చిక్కదనం ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. ఆవు పాలల్లో మూడు నుంచి నాలుగు శాతమే కొవ్వు ఉంటుంది. గేదె పాలలో 7 నుంచి 8 శాతం వరకు కొవ్వు ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఆవుపాల కంటే గేదె పాలు చాలా చిక్కగా ఉంటాయి. అంతే కాకుండా అవి అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతే కాదు ఆవు పాలతో పోల్చుకుంటే గేదె పాలలో 10 నుంచి 11 శాతం వరకు ప్రొటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా చదవండి: ఇలా చేస్తే సులభంగా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు…ఒకసారి ట్రై చేయండి వ్యాధులతో బాధపడేవారు వీటిని తాగడం ఎంతో మంచిది ప్రోటీన్లు ఎక్కువగా ఉండటంతో వేడి నిరోధకత వస్తుంది. నవజాత శిశువులు, వయో వృద్ధులకు గేదె పాలు తాగించవద్దని వైద్యులు చెబుతుంటారు. ఒక గ్లాస్ గేదె పాలల్లో 237 కేలరీలు ఉంటాయి. అదే ఆవు పాలల్లో 148 కేలరీలే ఉంటాయి. గేదె పాలలో పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కానీ ఆవు పాలను మాత్రం తీసిన రెండు రోజులలోపే తాగాల్సి ఉంటుంది. ఆవు పాలను వాడితే ఎంతో రుచి గేదె పాలు తెల్లగా, క్రీమ్ కలర్‌లో ఉంటాయి. ఆవు పాలు అయితే పసుపు, తెలుపు రంగును కలిగి ఉంటాయి. గేదె పాలలోని బీటాకెరోటిన్ రంగులేని విటమిన్‌గా మారుతుంది. అందుకే పసుపు రంగు పోతుంది. ఆవు పాలలోనూ బీటాకెరోటిన్ ఉంటుంది. అయితే మోతాదు మాత్రం తక్కువే అని చెప్పాలి. బాగా నిద్రపట్టాలంటే రాత్రి సమయంలో గేదె పాలు తాగితే బెటర్. నెయ్యి, పన్నీర్, కోవా, పెరుగు, పాయసం చేసుకోవడానికి గేదె పాలు బాగుంటాయి. స్వీట్లు చేసుకోవాలంటే మాత్రం ఆవు పాలను వాడితే ఎంతో రుచిగా ఉంటాయి. రెండింటి మధ్య చాలా తేడా ఉన్నా.. రెండూ ఆరోగ్యానికి మంచివే. వీటిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అవసరాన్ని బట్టి ఏ పాలు వాడాలో మనమే నిర్ణయించుకోవాలి. ఇది కూడా చదవండి: రెడ్ స్కర్టు ఫోటోల్లో కేకపెట్టిస్తోన్న హాట్ యాంకర్ #health-benefits #cow-milk #buffalo-milk మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి