/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-20T153237.346-1.jpg)
Telugu Film Producers Council Congratulated Nandamuri Balakrishna : తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంటూ యువ హీరోలకు పోటీనిస్తున్నారు. అదేవిధంగా బసవతారకం ఆసుపత్రితో బిజీగా ఉన్నప్పటికీ ఎంతో మందికి సేవ చేస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. రీసెంట్ గా వరుసగా మూడు బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో హ్యాట్రిక్ హీరోగా మారాడు. అంతేకాదు హిందూపూర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొంది హ్యాట్రిక్ లీడర్ అనిపించుకోవడంతోపాటు ప్రజలకు అనేక విధాలుగా సేవలందిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-20-at-3.11.55-PM-768x1024.jpeg)
ఇక ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి MLA గా గెలిచినా సందర్భంగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఆయన్ని స్వయంగా ఇంటికెళ్లి కలిశారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు శాలువా కప్పి, పుష్ప గుచ్ఛం ఇచ్చి ప్రతేకంగా అభినందించారు. కాగా బాలయ్యను కలిసిన వారిలో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు శ్రీ కె. ఎల్. దామోదర్ ప్రసాద్, సెక్రటరీ శ్రీ టి. ప్రసన్న కుమార్, ఇసి మెంబర్ శ్రీ వి.వెంకటరమణారెడ్డి (దిల్ రాజు), తెలుగు చలనచిత్ర వర్తక వాణిజ్య మండలి అధ్యక్షుడు శ్రీ వి.వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు), సెక్రటరీ శ్రీ కె.ఎల్.దామోదర్ ప్రసాద్, కోశాధికారి శ్రీ టి.ప్రసన్న కుమార్, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె. అనుపమ్ రెడ్డి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదాల రవి తదితరులు ఉన్నారు.
Also Read : విజయ్ దేవరకొండ సినిమాలో నటించాలని ఉందా? అయితే ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేస్కోకండి!
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-20-at-3.11.56-PM-768x1024.jpeg)
Follow Us