/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-55-1-jpg.webp)
Lok Sabha : లోక్ సభ ఎన్నిక(Lok Sabha Elections) లో బరిలోకి ‘పొలిమేర’ నటి దిగింది. పలు వెబ్ సిరీస్(Web Series), సినిమా(Cinema) లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దాసరి సాహితి(Dasari Sahithi) రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు తెలిపింది. అంతేకాదు బుధవారం రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు నామినేషన్ సమర్పించింది.
View this post on Instagram
ఇది కూడా చదవండి: Samantha: అవి ఆపండి.. నెటిజన్లకు సమంత సీరియస్ వార్నింగ్!
ఇక ఇటీవల తన ఇన్‌స్టా వేదికగా రాజకీయాల గురించి స్పందించిన సాహితి.. తాను పవన్‌కల్యాణ్(Pawan Kalyan) అభిమానినని చెప్పింది. ఇన్‌స్టాలో రీల్స్ చేసే పాటలకు పొలిటికల్ విషయాలతో ముడిపెట్టొద్దని కోరింది. అలాగే చేవేళ్ల నుంచి బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్(Congress) నుంచి రంజిత్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు.