Prabhas V/S Shahrukh : రెబల్ స్టార్‌ వర్సెస్ బాలీవుడ్ బాద్‌షా..!!

డార్లింగ్ ఫాన్స్ కు గుడ్ న్యూస్‌. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మూవీ సలార్ క్రిస్‌మస్‌ బరిలో నిలవనుంది. డిసెంబర్‌‌ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో వస్తున్న ‘డుంకీ’తో పోటీ పడనున్నట్లు తెలుస్తోంది.

New Update
Prabhas V/S Shahrukh : రెబల్ స్టార్‌ వర్సెస్ బాలీవుడ్ బాద్‌షా..!!

Prabhas V/S Shahrukh: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన మూవీ సలార్. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28వ తేదీనే విడుదల కావాల్సి ఉంది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో విడుదలను వాయిదా వేశారు. సలార్‌‌ వచ్చే ఏడాది వేసవిలోనే వస్తుందన్న ప్రచారం జరుగుతుండగా డార్లింగ్ ఫాన్స్ కు ట్రీట్ ఇస్తూ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సలార్ మూవీ రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక పార్ట్‌1 వరకు సిజ్‌ ఫైర్ అని టైటిల్ పెట్టారు.

బాహుబలి తర్వాత వరుస ఫ్లాప్స్‌లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్‌‌’పై చాలా అంచనాలు పెట్టుకున్నాడు. కెజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌‌ టైనర్‌‌ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా క్రిస్‌మస్‌ బరిలో నిలవనుంది. సలార్‌‌ను డిసెంబర్‌‌ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో వస్తున్న ‘డుంకీ’తో పోటీ పడనుంది. పఠాన్, జవాన్‌ చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న షారుక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.

ఇక ఈ విషయంపై బాలీవుడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన సలార్ ఎగ్జిబిటర్ల మెయిల్స్ కూడా వెళ్లాయని ఆయన వివరించాడు. సలార్ వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న రిలీజ్ అవుతుందని ఆయన తన ట్విట్ లో చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై హంబాలుఫిల్మిస్‌ అధికారిక ప్రకటన చేస్తుందని కూడా ఆయన రాసుకొచ్చాడు.

ఈ సందర్భంగా షారుక్ వర్సెస్ ప్రభాస్ తప్పేలా లేదని వివరించిన ఆయన బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన డుంకి సినిమా కూడా అదే రోజున విడుదల కానుంది అని దీంతో సలార్ వర్సెస్ డుంకీ ఉంటుందని తరుణ్ తన ట్విట్ లో వివరించాడు. ఒకవేళ సలార్ రిలీజ్ అయితే డుంకి కూడా అదే రోజున రిలీజ్ అవుతుందా లేదా వాయిదా పడుతుందా అనే సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది.

Also Read: రజనీ కాళ్ళు మొక్కిన లారెన్స్ రాఘవ

Advertisment
తాజా కథనాలు