చివరి రోజు..
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసే అభ్యర్థుల నుంచి బీజేపీ అధిష్ఠానం దరఖాస్తుల ప్రక్రియ చేపట్టింది. బీజేపీ ఆశావహుల నుంచి వెల్లువలా దరఖాస్తుల సమర్పణ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శనివారం (నిన్న) ఒక్కరోజే 1,603 మంది దరఖాస్తులు సమర్పించారు. దీంతో గత ఆరు రోజుల్లో మొత్తం అందిన అప్లికేషన్ల సంఖ్య 3,223కు చేరుకుంది. ఆదివారం దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో దరఖాస్తులు భారీ సంఖ్యలోనే వస్తాయని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు.
This browser does not support the video element.
ముఖ్య నేతల దరఖాస్తు
ఈ నెల 4న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు కాగా.. ఆదివారంతో గడువు ముగియనుంది. చివరి రోజు భారీగానే దరఖాస్తులు వస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆరు రోజుల్లో పార్టీ ముఖ్య నేతలు పెద్దగా దరఖాస్తు చేసుకోలేదు. వాళ్లంతా నేడు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే శనివారం ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, గజ్జల యోగానంద్, మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు బేజాది బీరప్ప, యెడ్ల సతీష్ కుమార్ టికెట్ కోసం తదితరులు దరఖాస్తులిచ్చారు.
This browser does not support the video element.
భారీగా వచ్చే అవకాశం
ఆదివారంతో దరఖాస్తుల స్వీకారం ముగుస్తున్నా.. చివరి రోజు కావడంతో దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. గుట్టుచప్పుడు కాకుండా వారి పర్సనల్ సిబ్బంది ద్వారా దరఖాస్తులు సీనియర్ నేతలు పంపిస్తున్నారు. ముషీరాబాద్ అసెంబ్లీ స్థానానికి బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయ లక్ష్మి దరఖాస్తు చేసుకున్నారు. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఇదే స్థానం నుంచి పోటీ చేసే అవకాశం..? ఉంది. ముషీరాబాద్ అసెంబ్లీ స్థానానికి గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ దరఖాస్తు పెట్టుకున్నారు. స్థానిక కార్పొరేటర్లు సైతం ముషీరబాద్ స్థానానికి పోటీ పడుతున్నారు. వలస నేతలతో పాటు పార్టీ ముఖ్య నేతలకు కొంత వెసులుబాటు ఉంటుందని నాయకులు అంచనా. అయితే గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి ఈటల రాజేందర్‌ను ఎంపిక చేయాలని కోరుతూ గజ్వేల్ నేతలు నిన్న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వినతిపత్రం సమరిపించన విషయం తెలిసిందే.
This browser does not support the video element.