Telangana: తెలంగాణలో స్కాలర్‌షిప్‌ల ధరఖాస్తు గడువు పెంపు

తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చే బోధన, స్కాలర్ షిప్‌ల దరఖాస్తు గడువును పొడిగించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, ఈబీసీ విద్యార్ధులు మార్చి 31 వరకు దరఖాస్తులను పెట్టుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

New Update
Telangana: తెలంగాణలో స్కాలర్‌షిప్‌ల ధరఖాస్తు గడువు పెంపు

Scholorships: తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి స్కాలర్‌షిప్స్, బోధనా రుసుముల రెన్యువల్, కొత్త విద్యార్థుల దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. డిసెంబర్ 31తో ముగియాల్సిన ఈ దరఖాస్తుల గడువును ముందు ప్రభుత్వం నెలపాటూ పొడిగించింది. ఇప్పుడు మళ్ళీ దాన్నే మార్చి 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొన్ని కోర్సుల్లో లేట్ అడ్మిషన్లు జరగడం, ప్రవేశాల సమాచారం ప్రభుత్వానికి ఆలస్యంగా రావడంతో గడువును పెంచుతున్నామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులైన విద్యార్థులు మార్చి 31వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.

Also Read:Vijayawada:గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్

గత ఏడాది ఆగస్టు 19న మొదలైన దరఖాస్తుల స్వీకరణ..

రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాల దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 19న ప్రారంభమైంది. ఈ గడువు ఆదివారంతో ముగియనుంది. ఈపాస్ గణాంకాల ప్రకారం రెన్యువల్ విద్యార్థులు 8,04,304 మంది ఉంటే ఇప్పటివరకు కేవలం 5.08 లక్షల మంది మాత్రమే అర్జీలు సమర్పించారు. కొత్తగా ప్రవేశాలు పొందిన వారు దాదాపు 5 లక్షల మంది ఉంటే.. 1.82 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది.

తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకారవేతనాలు, బోధన ఫీజుల కోసం సంక్షేమశాఖలు స్వీకరిస్తున్న దరఖాస్తులు గడువు డిసెంబరు 31తో ముగియిలా.కానీ ఇప్పటివరకు కేవలం 4 లక్షల మంది విద్యార్థులు మాత్రమే వీటికోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ ఆలస్యం కావడంతో దరఖాస్తు గడువు మరో మూడు నెలలు పొడిగించాలని ఎస్సీ సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ నుంచి సానుకూల స్పందన రావడంతో దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడిగించారు.

Advertisment
తాజా కథనాలు