Half Day Schools: ఏపీ, తెలంగాణాలో ఒంటిపూట బడులు !
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఒంటి పూట బడులు ప్రారంభంకానున్నాయి. మార్చి మొదటి వారం నుంటి ఉష్ణోగ్రతలు పెరగటంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఒంటి పూట బడులు ప్రారంభంకానున్నాయి. మార్చి మొదటి వారం నుంటి ఉష్ణోగ్రతలు పెరగటంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈనెల 15వ తేదీన ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎంవోను సీఎం ఆదేశించారు. రంజాన్ మాసంలోని మొదటి శుక్రవారం ముస్లీం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొననున్నారు.
తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్సరర్ల భర్తీకీ సంబంధించిన ఇష్యూలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నోటిఫికేషన్ వివాదం కొనసాగుతుండగానే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టాలని గురుకుల బోర్డుకు సూచించింది.
తనను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని అన్నారు. తమ పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ వద్దకు వచ్చినట్లు తెలిపారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని తేల్చి చెప్పారు.
హాస్టల్ వార్డెన్ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. 581 ‘హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్' గ్రేడ్ 1, 2 కేటగిరీల పోస్టులకు సంబంధించిన పరీక్షలను జూన్ 24 నుంచి నిర్వహించబోతున్నట్లు తెలిపింది. అలాగే డీఏఓ ఎగ్జామ్స్ కూడా జూన్ 30 నుంచి ఉంటాయని ప్రకటించింది.
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీజీపీలోకి వెళ్లొద్దంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బుజ్జగింపులు మొదలుపెట్టారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు పొటాపోటిగా నినాదాలు చేశారు. హరీష్రావు ఆదేశాలతో రమేష్ ను హైదరాబాద్ తీసుకొచ్చారు.
కేసీఆర్కు లోక్ సభ ఎన్నికల వేళ మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన మూడు రంగుల జెండా కప్పుకోనున్నట్లు సమాచారం.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థి చనిపోయాడు. జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 27 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. తెలంగాణలోని కాజీపేటకు చెందిన అతను ఇండియానా యూనివర్సిటీ-పర్డ్యూ యూనివర్సిటీ ఇండియానాపోలిస్ (IUPUI)లో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ ప్రోగ్రామ్లో ఇటీవలే చేరాడు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ ఎల్.నరసింహారెడ్డితో న్యాయవిచారణ జరిపించనుంది.