TS Politics: ఆయనను చేర్చుకుంటే నేను పోతా.. కాంగ్రెస్ కు భువనగిరి ఎమ్మెల్యే అల్టిమేటమ్!
కాంగ్రెస్ లో చేరి భువనగిరి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయనను చేర్చుకుంటే తన దారి తాను చూసుకుంటానని ఆయన పార్టీకి తేల్చి చెప్పినట్లు సమాచారం.