Telangana : దావోస్ లో తెలంగాణకు పెట్టుబడుల వరద
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు భారీ పెట్టబడుల వరద కొనసాగుతుంది. గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో రూ.8000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది.
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు భారీ పెట్టబడుల వరద కొనసాగుతుంది. గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో రూ.8000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సర్జరీ తరువాత నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసీఆర్ కోలుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. కేసీఆర్ త్వరలో జిల్లాల పర్యటన చేపడుతారని ఇటీవల కేటీఆర్ తెలిపిన విషయం తెలిసిందే.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల స్థానాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
సంక్షోభంలో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్ అయింది. తన సోషల్ మీడియా ఖాతాలు ఎవరో హ్యాక్ చేశారంటూ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు కవిత.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో తన పేరును కాంగ్రెస్ అధిష్టానం చేర్చకపోవడంపై స్పందించారు అద్దంకి దయాకర్. పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని అన్నారు. తనకు మరింత మంచి పొజిషన్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపథకం అమలుపై సందిగ్ధత నెలకొంది. ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు విషయంలో ప్రభుత్వానికి సరైన స్పష్టత రాలేదు. ఇళ్ల నిర్మాణం విషయంలో అధికారులు పలు సందేహలు వ్యక్తం చేస్తున్నారు.
రైతుబంధు నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని అన్నారు. అలాగే ఒకేదఫాలో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రైతులు ఎవరు అధైర్యపడొద్దని అన్నారు.
వచ్చే నెలలోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అన్నారు.