/rtv/media/media_files/2025/12/12/fotojet-2025-12-12t131305651-2025-12-12-13-13-29.jpg)
Youth for Anti-Corruption Demands
Youth for Anti-Corruption : సమాజంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాటిని నిరోధించాలంటే తప్పు చేసినా వారికి సత్వర శిక్షలు పడాలి. అప్పుడే బాలికలు, మహిళల జోలికి వెళ్లాలంటేనే భయం ఉంటుంది. మరొకరికి తప్పు చేయాలనే ఆలోచనే రాదు. కాని మన తెలంగాణలో గత ఐదు సంవత్సరాలకు సంబంధించి ఫోక్సో కేసుల వివరాలను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సహ చట్టం ద్వారా సేకరించింది. ఈ కేసులను పరిశీలిస్తే శిక్షలు పడ్డవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా ఫోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఫోక్సో కేసు పెండింగ్‌లపై దృష్టి పెట్టాలి. తక్షణమే విచారణ జరిపి పోలీసులు, న్యాయ స్థానం బాధితులకు సత్వర న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.
/filters:format(webp)/rtv/media/media_files/2025/12/12/a2e272cd-34e6-404e-a60d-161bdf34ef4c-2025-12-12-13-13-59.jpg)
తెలంగాణ రాష్ట్రంలో 2020 నుంచి 2025 వరకు ఎన్ని ఫోక్సో కేసులు నమోదయ్యాయి. ఫోక్సో కేసులలో ఎంతమంది నిందితులు అరెస్ట్ చేశారు. ఇంకా ఎంతమంది నిందితులు పట్టుబడకుండా పరారీలో ఉన్నారు. జిల్లాల వారీగా తెలపండి. ఎన్ని ఫోక్సో కేసులలో నిందితులకు శిక్షలు పడ్డాయి. ఇంకా ట్రయల్‌లో ఉన్న కేసులు ఎన్ని అన్న దానిపై సమాచారాన్ని తెలపాలని తెలంగాణ డిజిపి కార్యాలయానికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నుంచి సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. అందుకు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఉమెన్ సెప్టీ వింగ్ ఇచ్చిన సమాచారాన్ని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి విడుదల చేశారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/12/12/cbfde714-d1da-49a6-8de8-e6b0f0612ce9-2025-12-12-13-14-22.jpg)
ఫోక్సో కేసులు నమోదు..
2020 నుంచి 2025 ఏప్రిల్ వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఫోక్సో కేసులు.. 16994
అందులో అత్యధికంగా రాచకొండ పరిధిలో 2619 కేసులు నమోదయ్యాయి.
అతి తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.
ఫోక్సో కేసులు అరెస్ట్
2020 నుంచి 2025 ఏప్రిల్ వరకు నమోదైన ఫోక్సో కేసులలో 15634 మంది అరెస్ట్ అయ్యారు.
అరెస్ట్ కాకుండా పెండింగ్‌లో ఉన్న కేసులు 8979
కన్వీక్షన్ కేసులు .. 188
పిటి కేసులు .. 12771
విడాకుల కేసులు
అలాగే తెలంగాణ రాష్ట్రంలో 2020 జనవరి నుంచి 2025 జూలై వరకు మొత్తం ఎన్ని విడాకుల కేసులు నమోదయ్యాయి. అందులో విడాకులు అయినా కేసులు ఎన్ని, పెండింగ్ కేసులు ఎన్ని సంవత్సరాల వారీగా తెలపండి. వరకట్నపు మరణాలు ఎన్ని, పెండింగ్‌లో ఉన్న కేసులు ఎన్ని తెలపాలని యూత్ పర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా తెలంగాణ డిజిపి కార్యాలయానికి దరఖాస్తు చేసిందని యూత్ పర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. అయితే దానికి విడాకులు కేసులకు సంబంధించిన సమాచారం తమ దగ్గర లేదని తెలంగాణ పోలీస్ మహిళా వింగ్ నుంచి సమాచారం పంపారు. వరకట్నం సంబంధించిన సమాచారం అందుబాటులో ఉందని అందుకు సంబంధించిన సమాచారం అందిస్తామని చెపుతూ సమాచారాన్ని అందజేశారు. అందుకు సంబంధించిన సమాచారం వివరాలు..
వరకట్న కేసులు
2020 నుంచి 2025 ఏప్రిల్ వరకు నమోదైన వరకట్నకేసులు 51586 కేసులు నమోదు కాగా వాటిలో 26523 కేసులు శిక్షలు పడ్డాయని, 3238 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.అలాగే వరకట్నం హత్యల విషయంలో 604 కేసులు నమోదు కాగా వాటిలో 411 కేసులు పరిష్కారం అయ్యాయని, 63 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం అందించారు.
డ్రగ్స్ కేసులు
వీటితో పాటు రాష్ట్రంలో నమోదైన డ్రగ్స్ కేసుల వివరాలను కూడా యూత్ పర్ యాంటీ కరప్షన్ సంస్థ సేకరించింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో 2023లో స్థాపించబడిందని, అయితే 2022 నుంచి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న నిందితుల్లో 14000 మందిపై కేసు నమోదైందని తెలిపింది. వీటిలో 13684 మంది పురుషులు, 316 మంది స్ర్తీలు నిందితులుగా గుర్తించబడినట్లు సమాచార హక్కుచట్టం తెలిపింది. అయితే ఈ కేసులో సత్వర శిక్షలు పడకపోవడం వల్లే నేరాలు పెరుగుతున్నాయని, కేసులను సత్వరమే పరిష్కరించాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి డిమాండ్ చేశారు.
Follow Us