/rtv/media/media_files/2025/02/25/TnzjDcoRrq1roWi9C0oI.jpg)
Triveni Sangam Water Home Delivery ...
Kumbh Mela Water :: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సాగుతున్న కుంభమేళాకు కోట్లాది మంది వెళ్తూ పుణ్య స్నానాలు చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు వస్తున్నారు. అయితే కుంభమేళాకు వెళ్లడానికి అందరికీ వీలు కాకపోవచ్చు. అలాంటి వాళ్లంతా బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేస్తే మీ ఇంటికొచ్చి పుణ్య జనాలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఆన్‌లైన్ స్టోర్లు. ఇది అక్షరాల నిజం. పలు ఆన్ లైన్ స్టోర్లు కుంభమేళా పుణ్య జలాలను డబ్బులకు విక్రయిస్తున్నాయి.
ఇది కూడా చూడండి: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే
కుంభమేళాకు వెళ్లలేకపోయిన వారందరికీ పలు ఆన్‌లైన్ స్టోర్లు గుడ్ న్యూస్ చెబుతున్నాయి. ఇంట్లో కూర్చుని మొబైల్ ద్వారా ఆర్డర్ పెట్టేస్తే చాలు.. కుంభమేళా జలాలను పది నిమిషాల్లోనే మీ ఇంటికి తెచ్చేస్తామంటున్నాయి. ఇప్పటికే పలు స్టోర్లు జలాలను సరఫరా చేస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో నిజమైన త్రివేణీ సంగమ జలాలను అమ్ముతున్నామని చెప్పుకునే అనేక బ్రాండ్లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 25న మధ్యాహ్నం 3 గంటల వరకు 100 ఎం.ఎల్ నీళ్లకు 118 రూపాయల నుంచి ధరలు ప్రారంభం అయ్యాయి. 299, 314, 400 వరకూ చూపిస్తున్నాయి.ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ అయిన అమెజాన్ వెబ్‌సైట్, యాప్‌లో కుంభమేళా పుణ్య జలాల ధర 249 రూపాయల నుంచి ప్రారంభం అయింది. బిగ్ బాస్కెట్ స్టోర్ ద్వారా స్వాతి బ్రాండ్ పుణ్య జలాలు 100 ఎం.ఎల్ కు రూ.100 రూపాయలు. కానీ పిన్‌కోడ్ల ఎంపికపై కొన్నింటికి ఒక్క రూపాయికి మాత్రమే అందిస్తోంది. జెప్టోలో కుంభమేళా సంగం జల్ ఎంపిక చేయబడిన పిన్‌కోడ్లలో 100 ఎం.ఎల్ బాటిల్ ను 55 రూపాయలకు మాత్రమే అందిస్తోంది.
ఇది కూడా చదవండి: Chhaava Telugu Version: 'ఛావా' హిందీ ఓకే.. మరి తెలుగు సంగతేంటి..?
బ్లింకిట్‌లో అయితే త్రివేణీ సంగమం పుణ్య జలాల 100 ఎం.ఎల్ సీసాను కేవలం 69 రూపాయలకే అందిస్తోంది. అంతేకాకుండా 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని కూడా వివరిస్తోంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం.. ఈరోజు ఆర్డర్ పెడితే రేపే మీ ఇంటికి వచ్చేస్తాయి. శివరాత్రి పర్వదినం రోజు పుణ్య జలాలతో స్నానాలు చేసి.. కుంభమేళాకు వెళ్లలేకపోయామన్న బాధను మర్చిపోవచ్చు ఏమంటారు.
Also read : తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పై లోకేష్ ప్రకటన..! ఎప్పటి నుంచంటే...
Also Read : ఏపీలో కుల పిచ్చి.. అప్పటి వరకే టీడీపీతో.. పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్