/rtv/media/media_files/2025/09/06/lingala-2025-09-06-11-44-39.jpg)
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ఈ ఏడాది కూడా రికార్డు సృష్టించింది. రూ. 1,116తో మొదలైన వేల-ంపాట రూ. 35 లక్షలకు వేలం వెళ్ళింది. ఇది గత సంవత్సరం ధర రూ. 30.లక్షలు కంటే రూ. 4.99 లక్షలు ఎక్కువ పలికింది. ఈ లడ్డూను హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ గారు దక్కించుకున్నారు. గత ఆరేళ్లుగా ఆయన ఈ వేలంలో పాల్గొంటున్నప్పటికీ, ఈసారి విజేతగా నిలిచారు. బాలాపూర్ లడ్డూ వేలంపాట 1994లో కేవలం రూ. 450తో ప్రారంభమై, ప్రతి ఏటా ధర పెరుగుతూ వస్తోంది.లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బును బాలాపూర్ గ్రామాభివృద్ధి, దేవాలయాలు, పాఠశాలలు వంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. లడ్డూను దక్కించుకున్న వారికి అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం..
బాలాపూర్ :
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) September 6, 2025
లడ్డూ విజేత లింగాల దశరథగౌడ్‌ను సన్మానించిన ఉత్సవ కమిటీ.
గతేడాది కంటే 4.99 లక్షలు అధికంగా పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డూ.
బాలాపూర్ గణేష్ లడ్డూ అంటే నాకు చాలా ఇష్టం.
బాలాపూర్ గణేష్ లడ్డూ కోసం ఆరేళ్లుగా ప్రయత్నిస్తున్నా.
ఇన్నేళ్ల తర్వాత బాలాపూర్ గణేష్ లడ్డూ… pic.twitter.com/bEvUBQtn0D
సిమెంట్, స్టీల్ షాపులు
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటలో గెలుచుకున్న లింగాల దశరథ్ గౌడ్ ఎవరనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. లింగాల దశరథ్ గౌడ్ ఒక వ్యాపారవేత్త, ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నారు. ఆయనకు కర్మన్‌ఘాట్‌లో లోకల్ గా చాలా సిమెంట్, స్టీల్ షాపులున్నాయి. ఆయనకు ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ప్రతి సంవత్సరం వేలంలో ఉత్సాహంగా పాల్గొని, లడ్డూను గెలుచుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఈ సారి గెలుచుకున్నారు. ఈ సారి రూ. 35 లక్షలకు లడ్డూను దక్కించుకోవడం ద్వారా ఆయన వార్తల్లో నిలిచారు. ఈ లడ్డూను గెలుచుకున్న తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఈ లడ్డూను అందరికి పంచిపెడతానని వెల్లడించారు.