Hyderabad: 90 రోజుల స్పెషల్‌ డ్రైవ్.. త్వరలోనే ఆ సమస్యలకు చెక్‌

హైదరాబాద్‌లో గత 20 ఏళ్లుగా ఇలా పూడికతో నిండిపోయిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు వాటర్‌ బోర్డు రంగంలోకి దిగింది. 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌తో ప్రతీ మ్యాన్‌హోల్‌ను కూడా క్లీన్ చేయనుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Drainage
New Update

హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో సరైన క్లీనింగ్ లేక పూడికతో నిండిపోయిన డ్రైనేజీలు ఉన్నాయి. గత 20 ఏళ్లుగా ఇలా పూడికతో నిండిపోయిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు వాటర్‌ బోర్డు రంగంలోకి దిగింది. ప్రస్తుతం నగరంలో చిన్న వాన పడినా కూడా అనేక చోట్ల.. ముఖ్యంగా మెయిన్‌రోడ్లపై డ్రైనేజీలు ఓవర్‌ఫ్లో అవుతున్నాయి. దీంతో అక్కడ కంపు వాసన కొడతోంది. దీంతో ఆ మురికి నీటిలోనే వాహనాలు, పాదాచారులు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షం పడనప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు ఓవర్‌ఫ్లో అవుతున్నాయి. కానీ వీటిని ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు. 

Also Read:  ‘బ్యాడ్‌ టచ్‌’ అవగాహనలో అటెండర్‌ దుశ్చర్య

90 రోజుల స్పెషల్ డ్రైవ్

ఒకవేళ సిబ్బంది వచ్చినా కూడా పైపేనే క్లీన్ చేసి వెళ్లిపోతున్నారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఈ డ్రైనేజీ సమస్య నగర ప్రజలను వెంటాడుతోంది. చాలావరకు డ్రైనేజీలు ఏళ్లుగా పూడికతో పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే వాటర్‌ బోర్డు ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌తో ప్రతీ మ్యాన్‌హోల్‌ను కూడా క్లీన్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దీని పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో చిన్నచిన్నవి మినహాయించి 4 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతు మ్యాన్‌హోల్స్‌ దాదాపు 4 లక్షల వరకు ఉన్నాయి. అలాగే మెయిన్‌రోడ్లపై ట్రంక్మెయిన్లు (15 నుంచి 20 అడుగుల లోతు) 50 వేలకు పైగా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పూర్తిగా శుభ్రం చేస్తేనే మరో పదేళ్ల వరకు డ్రైనేజీ ఓవర్‌ఫ్లో సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.

Also Read: మూసీ నిర్వాసితులకు సర్కార్ బంపర్ ఆఫర్..200 గజాల స్థలం, రూ.30 లక్షలు..!

25 స్పెషల్ టీమ్స్

ఈ 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌లో మూడున్నర లక్షల మ్యాన్‌హోల్స్‌ను క్లీన్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు. ప్రతీరోజు 400 మ్యాన్‌హోల్స్ క్లీనింగ్ చేయాలని సిబ్బందికి ఆదేశించినట్లు పేర్కొన్నారు. దీనికోసం  25 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశామని.. ఒక్కో బృందానికి ఐదుగురు సిబ్బంది ఉంటారని తెలిపారు. పూడిక తీయడం కోసం 200 ఎయిర్ టెక్‌ మెషీన్లను, పూడిక తీసిన అనంతరం మరో 140 సిల్డ్ క్యారియర్ వాహనాలను అందుబాటులో ఉంచారు. 20 ఏళ్లలో మహానగరంలో ఈ స్థాయిలో డీ సిల్డింగ్ పనులు చేయడం ఇదే మొదటిసారి.  ఇక వచ్చే వర్షాకాలం నాటికి గ్రేటర్‌ హైదరాబాద్‌ను సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీగా రూపొందించడమే లక్ష్యంగా అధికారులు ముందుకు వెళ్తున్నారు. 

Also Read: అన్ స్టాపబుల్ లో జూ.ఎన్టీఆర్ ప్రస్తావన.. బాలయ్య, చంద్రబాబు మధ్య హాట్ డిస్కషన్?

Also Read:  బిగ్ బాస్ షోలో గంగవ్వకు గుండెపోటుపై కీలక ప్రకటన

#telugu-news #hyderabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe