Warangal : పథకాల విషయంలో లొల్లి.. కన్నతల్లినే చంపేసిన కొడుకు!

జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌ పూర్‌ మండలం నమిలిగొండ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఫ్రీ కరెంట్, సబ్సిడీ గ్యాస్ పథకాలను తనకు వర్తించేలా చేయాలని కోరిన తల్లి అచ్చమ్మను కుమారుడు సత్తయ్య రాడ్డుతో కొట్టి చంపేశాడు.

author-image
By Bhavana
New Update
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

Crime: ప్రభుత్వ పథకాల విషయంలో వివాదం తలెత్తి కన్నతల్లిని కుమారుడు ఇనుప పైపుతో కొట్టి హతమార్చిన దారుణ సంఘటన జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌ పూర్‌ మండలం నమిలిగొండ గ్రామంలో జరిగింది. గ్రామస్థులు , పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన సముద్రాల లచ్చమ్మ (65) చిన్న కుమారుడు సత్తయ్య కాజీపేటలో అద్దె నివాసంలో ఉంటున్నాడు. 

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివిధ ఉచిత పథకాలను రేషన్‌ కార్డు సాయంతో పొందుతున్నాడు. ఉమ్మడిగా ఉన్న రేషన్‌ కార్డు తీసుకెళ్లి నువ్వు ఒక్కడివే పథకాలు ఎలా పొందుతావని శుక్రవారం అర్థరాత్రి తల్లి ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో గతంలోనూ తనకు రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులు సరిగా ఇవ్వలేదని క్షణికావేశానికి లోనైన సత్తయ్య తల్లిని ఇనుప పైపుతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు నిందితుడి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read :  టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Advertisment
తాజా కథనాలు