CM Revanth Reddy: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఈడీ కేసులో ఈరోజు విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు జడ్జి అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా పడింది. విచారణ నవంబర్ 14కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే గతంలో ఈ కేసుపై జరిగిన విచారణకు సీఎం రేవంత్ డుమ్మా కొట్టారు. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఉండడం వల్ల తాను విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు కోర్టుకు తెలిపారు. అయితే.. దీనిపై విచారణ జరిపిన ధర్మసం తదుపరి విచారణకు తప్పకుండ హాజరు కావాలని సీఎం రేవంత్ కు ఆదేశాలు ఇచ్చింది. కాగా సీఎం రేవంత్ ఈరోజు విచారణకు హాజరవుతారా? లేదా? అనే చర్చకు తెర దింపారు జడ్జి. ఈరోజు జడ్జి అందుబాటులో లేకపోవడంతో విచారణ వచ్చే నెల 14కి వాయిదా పడింది.
ఇది కూడా చదవండి: విషాదం.. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి!
సీఎం రేవంత్ పై కోర్టు సీరియస్..
ఓటుకు నోటు ఈడీ కేసు గత నెల 24న నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది. ఆ రోజు విచారణకు నిందితుడు మత్తయ్య జెరూసలేం హాజరు కాగా రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణకీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ హాజరు కాలేదు. నిందితులు ఎందుకు హాజరు కావడం లేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ దశలో ఆ రోజు విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిందితులు వేసిన పిటిషన్లకు కోర్టు అనుమతించింది. కాగా అభియోగాల నమోదుపై విచారణ కోసం వచ్చే నెల 16 హాజరు కావాలని రేవంత్ రెడ్డితో పాటు నిందితులందరినీ ఆదేశించింది. ఇవాళ రేవంత్ రెడ్డి రాకపోతే కోర్టు ముందు నిరాహార దీక్ష చేస్తానని నిన్న మత్తయ్య ప్రెస్ మీట్ పెట్టారు. జడ్జి సెలవులో ఉండటంతో విచారణ నవంబర్ 14కి వాయిదా వేసింది ఈడీ కోర్టు.
ఇది కూడా చదవండి: దేనితో కొట్టాలి రేవంత్.. కేటీఆర్ సంచలన ట్వీట్!
ఈ కేసు ఏంటి?
2015లో తెలంగాణ (Telangana) లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రయత్నించారని తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో చర్చలు జరిపిన వీడియోను సైతం ఏసీబీ విడుదల చేయడంతో అది సంచలనంగా మారింది. ఆ కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లారు.
ఈ సందర్భంగా చంద్రబాబు స్టీఫెన్ సన్ తో జరిపిన ఫోన్ సంభాషణలు కూడా బయటకు రావడంతో కేసు మరింత సంచలనంగా మారింది. నాటి సీఎం కేసీఆర్, అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత జగన్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఏపీలో దోచుకున్న డబ్బుతో చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించారని వైసీపీ నేతలు ఆరోపించారు.
ఇది కూడా చదవండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్!