సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మరోసారి ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్లారు. రెండు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణకు ఆమోదం లభిస్తుందని చర్చ జరుగుతోంది.
ఇది కూడా చదవండిః నేను త్యాగం చేస్తేనే రేవంత్‌కు సీఎం పదవి.. మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు!
ఇటీవల టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కొంత ఆలస్యమైందని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ చర్చల నేపథ్యంలో ఆశావహులు అలర్ట్ అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఒక్క మంత్రి కూడా లేకపోవడంతో ఈసారి ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈసారి తమకు పదవి దక్కించుకునేందుకు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు.
అన్నదమ్ముల మధ్య తీవ్ర పోటీ..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావుతో పాటు, వివేక్, వినోద్ సోదరులు రేసులో ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతగా మంత్రి పదవి ఆశిస్తున్నానని మీడియా ముందు కుండబద్దలు కొట్టారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు. అయితే కాకా ఫ్యామిలీలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివేక్, వినోద్ సోదరులు ఢిల్లీ స్థాయిలో మంత్రి పదవి కోసం ఎవరికి వారు లాబీయింగ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండిః నేడు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఇప్పటికే వివేక్ తనయుడికి పెద్దపల్లి ఎంపీగా అవకాశం రావడంతో కాకా ఫ్యామిలీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని వినోద్ నేరుగా సోనియాగాంధీ స్థాయిలోనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఆదిలాబాద్ జిల్లా సమావేశంలోనూ ఆయన పీసీసీ చీఫ్ ఎదుట తన అభిప్రాయాన్ని కుండబ్దలు కొట్టినట్లు తెలుస్తోంది. మీటింగ్ ముగిసిన అనంతరం ఆర్టీవీతో మాట్లాడారు ఎమ్మెల్యే వినోద్.
ఇది కూడా చదవండిః నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
ప్రస్తుతం ఉన్న అందరు ఎమ్మెల్యేల కంటే తాను సీనియర్‌ని అని తనకే మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు. తన తమ్ముడికి వద్దని.. ఆయన కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చారని.. ఈసారి తనకే మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అలాగే ఢిల్లీ నేతలతో లాబీయింగ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండిః జగన్‌కు బిగ్ షాక్.. జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యేలు!
మరోపక్క ఎమ్మెల్యే వివేక్ సైతం ఎలాగైనా మంత్రి పదవిని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు మంత్రులతో కలిసి అధిష్టానం వద్ద పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. అమాత్య పదవి కోసం అన్నదమ్ముల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కాకా ఫ్యామిలీలో విభేదాలున్నాయా అన్న చర్చ జరుగుతోంది.