భారీ వర్షం.. కళ్లముందే ఇద్దరు మృతి

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం, వెంకటాపూర్‌లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో కుకట్ల రాజుయాదవ్‌ (25), దౌతుబాజి శ్రావణి(17) ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి గాయాలు అయ్యాయి.

Lightning Strikes in UP: ఘోర విషాదం.. పిడుగుపాటుకు 38 మంది మృతి!
New Update

ఉరుములు, మెరుపులతో భారీ వర్షం. ఎక్కడి వాళ్లు అక్కడే ఆగిపోయారు. పొలాల్లో ఉన్నవాళ్లు మెల్లమెల్లగా ఇంటికి చేరుకున్నారు. ఇతర పనులకు వెళ్లేవారు.. సమీపంలోని షెడ్డు, చెట్టుల కింద నిల్చు్న్నారు. వర్షం తీవ్రత మరింత ఉధృతంగా మారింది. అదే సమయంలో చుట్టూ ఎలాంటి షెడ్డు లేకపోవడంతో కొందరు పక్కనే ఉన్న చెట్టు కింద నిల్చున్నారు.

ఇది కూడా చదవండి: దానికోసం.. అత్తతో కలిసి అల్లుడు, చివరికి ఇలా దొరికారు

అదే సమయంలో అకస్మాత్తుగా ఆ చెట్టుపై పిడుగు పడింది. దీంతో చెట్టుకింద నిల్చున్నవారంతా స్పృహ కోల్పోయారు. ఇక కాసేపటికి కొందరు పైకి లేచారు. కానీ ఓ యువతి, యువకుడు మాత్రం ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పిడుగుపాటుకు రెండు ప్రాణాలు బలి

ఐనవోలు మండలం, వెంకటాపూర్‌లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో ఊరి శివారులో పత్తి చేనులో పత్తి ఏరుతున్న కొందరు రైతులు, కూలీలు సమీపంలోని రేకుల షెడ్డు కిందకు చేరుకున్నారు. అదే సమయంలో కుకట్ల రాజు యాదవ్ (25) షెడ్డు అంచున సైకిల్‌ పట్టుకుని నిల్చున్నాడు. ఆ పక్కన ఇంటర్ విద్యార్థిని దౌత్‌బాజీ శ్రావణి (17) నిల్చుంది.

ఒక్కసారిగా షెడ్డు పక్కనే ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో అక్కడున్నవారంతా స్పృహ తప్పిపోయారు. ఆ తర్వాత కొద్ది సేపటికి షెడ్డులో ఉన్నవారంతా చిన్న చిన్న గాయాలతో పైకి లేచారు. కానీ రాజు యాదవ్, శ్రావణి మాత్రం ప్రాణాలు కోల్పోయారు. అదే షెడ్డులో ఉన్న రాజు యాదవ్ తల్లి.. తన కళ్లముందే కొడుకు ప్రాణాలు పోవడంతో కన్నీరు మున్నీరైంది.

ఇది కూడా చదవండి: అవమానంతో యువకుడు.. ఏం చేశాడంటే?

కాగా రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ కూడా జారీ చేసింది. అందులో సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, జనగాం, హనుమకొండ, ములుగు, మేడ్చల్‌ తదితర జిల్లాలు ఉన్నాయి.

#crime-news #lightning
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe