TTD : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్ లోనే..

టీటీడీ నుంచి వాట్సాప్‌ ద్వారా దర్శనం బుకింగ్‌ సేవలు ప్రారంభించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సిఫార్సులతో పని లేకుండా సామాన్యులకు దర్శనం సులభతరం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

New Update
whatsapp

తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ దర్శనాల్లో కూడా రికమండేషన్‌ లేఖల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఎలాంటి సిఫార్సులతో పని లేకుండా సామాన్యులు సులభంగా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేలా ప్లాన్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.


Also Read:  ఇజ్రాయెల్‌-ఇరాన్‌ వివాదం పై జీ 7 అత్యవసర సమావేశం!

ముందస్తు బుకింగ్‌ విధానాన్ని తీసుకురావాలని ఇటీవల జరిగిన సమావేశంలో అధికారులతో అన్నారు. దీని గురించి అధికారులకు పలు సూచనలు కూడా చేసినట్లు సమాచారం.

ఇక నుంచి టీటీడీ నుంచి వాట్సాప్‌ ద్వారా దర్శనం బుకింగ్‌ సేవలు ప్రారంభించి...క్రమేణా అన్ని దేవాలయాల్లోనూ ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన అని తెలుస్తుంది. శ్రీవారి దర్శనంతో పాటు ఇతర సేవలకు ఉన్న ధరలను సైతం ప్రక్షాళన చేసి తక్కువ ఖర్చుతో వీలైనన్ని ఎక్కువ సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలన్నది ఏపీ ప్రభుత్వ నిర్ణయంగా తెలుస్తోంది.

Also Read: కొండా సురేఖ వ్యాఖ్యలు బాధపెట్టాయి: చిరంజీవి!

దీనికి అనుగుణంగా స్వామివారి దర్శనాలు, సేవలు మొదలు.. దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించే ఇతర సౌకర్యాలుపై దృష్ట సారించారు. ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరలను సమీక్షించి వాటిని ప్రక్షాళన చేయనున్నట్లుగా తెలుస్తోంది

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు