జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవడం ఖాయమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం చాలా మంది రేసులో ఉన్నారన్నారు. సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ సహ పలువురు జూబ్లీహిల్స్ టికెట్ అడుగుతున్నారన్నారు. స్థానికులకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్నారు. మంత్రుల కమిటీ, సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు. హైడ్రాతో సామాన్యుడికి ఇబ్బంది లేదన్నారు. కబ్జా చేసిన వారికి హైడ్రాతో ఇబ్బందులు ఉంటాయన్నారు.
ప్రభుత్వ భూమి అన్యక్రాంతం కాకుండా హైడ్రా పని చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లును కూలగొట్టడానికి హైడ్రా వెళ్లిందన్నారు. కానీ స్థానికులు కోర్టు ఆర్డర్ తీసుకురావడంతో ఆగాల్సి వచ్చిందన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా హైడ్రా పని చేస్తోందన్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జికి తెలియకుండా పాదయాత్ర చేశానని గతంలో కొందరు ఆరోపణలు చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలు అయిందన్నారు. బీఆర్ఎస్ మళ్లీ పునజ్జీవం పోసుకోదన్నారు. ఏం చూసి బీఆర్ఎస్ ను ప్రజలు ఆదరిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారన్నారు.
తెరపైకి కొత్త పేర్లు?
ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ కోసం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే.. ఇటీవల ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ప్రకటించడంతో రేసు నుంచి తప్పించినట్లు అయ్యింది. కొత్తగా మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ కోడలు విజయలక్ష్మి పేరు కూడా తెరపైకి వచ్చింది. నవీన్ యాదవ్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి అయితే సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పోటీలో ఉన్నారని ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎవరి పేరును ఫైనల్ చేస్తుందోన్న అంశం హాట్ టాపిక్ గా మారింది.
Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ రేసులో ఉన్న నలుగురు వీళ్లే.. పీసీసీ చీఫ్ సంచలన ప్రకటన!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ సహ పలువురు కాంగ్రెస్ టికెట్ అడుగుతున్నారన్నారు. అయితే.. స్థానికులకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్నారు. మంత్రుల కమిటీ, సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయన్నారు.