Mahesh Kumar Goud: జాబ్లీహిల్స్ మాదే.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్!

జాబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుంది. వెలువడిన రెండు రౌండ్లలో 1,144 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ పై అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.

New Update
mahesh

Mahesh Kumar Goud: జాబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో(jubilee hills by election results) కాంగ్రెస్ దూసుకుపోతుంది. వెలువడిన రెండు రౌండ్లలో 1,144 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ పై అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జాబ్లీహిల్స్  ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టబోతున్నారని, జాబ్లీహిల్స్ కాంగ్రెస్ దేనని  చెప్పారు. నవీన్ యాదవ్ కు మంచి మెజార్టీ రావాల్సి ఉండేది కానీ ..  ఓటింగ్ శాతం తగ్గడం ఫలితాలపై ప్రభావం చూపిస్తుందన్నారు.  ఇక షేక్‌పేట్‌ డివిజన్ ఫలితాల్లో బీజేపీ కనుమరుగైంది. రెండు రౌండ్లు కలిపి లంకల దీపక్ రెడ్డికి కేవలం 307 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రమంతులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు పెద్దగా లెక్కచేయలేదు.  

186 మంది సిబ్బంది

కౌంటింగ్ ప్రక్రియ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్‌కు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది.

 అప్‌‌డేట్స్‌‌ను ఎల్ఈడీ స్క్రీన్లు, ఈసీ యాప్‌‌ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. కౌంటింగ్ సెంటర్‌‌లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈవో హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు