BREAKING: గ్రూప్-1 అభ్యర్థులకు సర్కార్ పిలుపు

TG: గ్రూప్-1 అభ్యర్థులతో చర్చలు జరిపేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు చర్చల్లో పాల్గొనేందుకు గాంధీ భవన్‌కు గ్రూప్-1 అభ్యర్థులను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆహ్వానిచ్చారు. కాగా గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.

గ్రూప్‌-4 ఎగ్జామ్ రాస్తున్నారా.. TSPSC రూల్స్‌ ఇవే....!
New Update

Group-1: గ్రూప్-1 అభ్యర్థులతో చర్చలు జరిపేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు చర్చల్లో పాల్గొనేందుకు గాంధీ భవన్‌కు గ్రూప్-1 అభ్యర్థులను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆహ్వానిచ్చారు. గ్రూప్-1 అభ్యర్థులతో చర్చలు జరపాలని మహేష్ కుమార్ గౌడ్‌ను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. కాగా నిన్న అశోక్ నగర్ లో గ్రూప్ 1 పరీక్షలను వాయిదా చేయాలని, జీవో 29 రద్దు చేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన చేశారు. 

ఇది కూడా చదవండి: విచారణకు రమ్మన్నారు.. సజ్జల అరెస్ట్ తప్పదా?

జీవో 29 రద్దు చేయాలని..

నిన్న రాత్రి హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యథాతథంగా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు ముందు జరిగిన ప్రిలిమ్స్‌ పరీక్షలో తప్పులు, జీవో 29ను సవరించిన తర్వాతే ఇప్పటి పరీక్షలు నిర్వహించాలంటూ ఆందోళన చేశారు. కాగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చదవండి: విచారణకు రమ్మన్నారు.. సజ్జల అరెస్ట్ తప్పదా?

హాల్ టికెట్స్ విడుదల....

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1 హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు https://hallticket.tspsc.gov.in/h022024d08f5d90-6aaa-4360-acb2-046f588e3284 లింక్ పై క్లిక్ చేసి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గ్రూప్-1 టీజీపీఎస్సీ నోటిఫికేషన్ (TGPSC Group-1) విడుదల చేసింది. మొత్తం 563 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. జూన్ 9న ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మంది హాజరు కాగా.. 31,382 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు.

ఇది కూడా చదవండి: నేడు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe