తెలుగు సినిమాల్లో నటించకుండా ప్రకాశ్ రాజ్‌పై టాలీవుడ్ బ్యాన్ విధించనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల తిరుపతి లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపగా.. ఈ ఎపిసోడ్‌లో ప్రకాశ్‌రాజ్ చేసిన కామెంట్స్‌పై బీజేపీ-జనసేన భక్తులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అయినా ప్రకాశ్‌రాజ్ వెనక్కి తగ్గలేదు. వరుస పెట్టి ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. పవన్‌కు పరోక్షంగా కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. దీంతో ఆయనపై టాలీవుడ్ బ్యాన్ విధించనుందన్న ప్రచారం సాగుతోంది.
మండి పడుతున్న హిందూ సంఘాలు
పవన్, హిందూమతంపై ప్రకాశ్‌రాజ్ చేస్తున్న ట్వీట్లు, వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రకాశ్‌రాజ్ కామెంట్స్‌పై హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో బీజేవైఎం ఆందోళన నిర్వహించింది. ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్యకర్తలు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని, ప్రకాశ్‌రాజ్ డౌన్ డౌన్ అని, హిందువులకు ప్రకాశ్‌రాజ్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రకాష్ రాజ్ దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. ప్రకాశ్ రాజ్‌పై టాలీవుడ్ బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. ప్రకాశ్‌రాజ్‌పై చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్-మా'కు కంప్లైంట్ ఇచ్చారు.
అటు ప్రకాశ్ రాజ్‌పై మా బ్యాన్ విధించాలని ఇండస్ట్రీ వర్గాలు కూడా భావిస్తున్నాయట. అయితే ఇప్పటికే పలుమార్లు ఎన్నో వివాదాల్లో చిక్కుకొని టాలీవుడ్ నుంచి ప్రకాశ్‌రాజ్ బ్యాన్ అయిన సందర్భాలను చాలానే ఉన్నాయి. మరి తమకు వచ్చిన ఫిర్యాదుపై మా అసోసియేషన్ స్పందించి ప్రకాష్ రాజ్‌ని మందలిస్తుందా లేక అలాగే వదిలేస్తుందానన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీతో ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు పవన్. అయితే దీనిపై ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాన్ని దేశవ్యాప్తంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే పవన్ కూడా ఊరుకోలేదు. మీడియా ముఖంగా ప్రకాశ్‌రాజ్‌కు కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ప్రకాశ్ రాజ్‌పై ఫైర్ అయ్యారు. లడ్డూపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ప్రకాశ్ రాజ్‌కు వార్నింగ్ ఇచ్చారు. అయితే ప్రకాశ్‌రాజ్ మాత్రం వెనకడుగు వెయ్యలేదు. పవన్ మాట్లాడిన మాటలపై సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌ల మీద ట్వీట్లు పెడుతూనే ఉన్నారు.
జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్లు..
జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్‌తో ప్రకాశ్‌రాజ్ వరుస ట్వీట్లు చేస్తుండడం ఆసక్తిని రేపుతోంది. నేరుగా పవన్ పేరు ప్రస్తావించకున్నా ప్రకాశ్‌రాజ్ టార్గెట్ చేస్తుందని పవన్‌నేనని ట్వీట్లు చూస్తే క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. 'గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్?' అంటూ ప్రకాశ్‌రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. అంతకుముందు హీరో కార్తీ సారీ చెప్పిన దానిపై ప్రకాశ్‌రాజ్ స్పందించారు. 'చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్' అని మరో ట్వీట్ చేశారు. ఇక తాజాగా 'మనకేం కావాలి... ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..? అంటూ పవన్‌ను ఏకిపడేశారు ప్రకాశ్‌రాజ్!
లడ్డూ వివాదంలో హీరో కార్తీ రియాక్ట్ అయిన తీరును పవన్ తప్పపట్టారు. ఈ టాపిక్ సెన్సెటివ్ అని కార్తీ మీడియా మీటింగ్‌లో చెప్పగా.. అలా మాట్లాడవద్దని పవన్ చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది. దీని గురించి పవన్‌కు కార్తీ సారీ చెప్పడం.. పవన్ కూడా కార్తీ ట్వీట్‌కు రిప్లై ఇవ్వడం.. అటు ప్రకాశ్‌రాజ్ ఈ ఇద్దరికి కౌంటర్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మొత్తంగా చూస్తే ప్రకాశ్‌రాజ్ టార్గెట్ మాత్రం పవన్‌నేనని అర్థమవుతోంది. నాస్తికుడైన ప్రకాశ్‌రాజ్ తిరుమల లడ్డూ ఎపిసోడ్‌ని బీజేపీ ఆడుతున్న నాటకంగా చూస్తున్నారు. దీంతో ఈ విషయంలో ప్రకాశ్‌రాజ్‌కు సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. అయితే ఈ క్రమంలో తెలుగు సినిమాల్లో నటించకుండా ప్రకాశ్‌రాజ్‌ను బ్యాన్ చేస్తారన్న ప్రచారం వైరల్‌గా మారింది.