విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లాలోని ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో దారుణం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులు సురేశ్ (53), హేమలత (45), హరీశ్‌(22)గా గుర్తించారు.

New Update
Death

నిజామాబాద్ జిల్లాలోని ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో దారుణం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులు సురేశ్ (53), హేమలత (45), హరీశ్‌(22)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను బోధన్ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో వడ్డేపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Also Read: TGSRTCలో పెరుగుతున్న డొక్కు బస్సులు..

ఇక వివరాల్లోకి వెళ్తే సురేశ్-హేమలత దంపతుల కొడుడు హరీశ్ ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆటలు ఆడటం ప్రారంభించాడు. ఇందుకోసం అప్పులు చేసి మరి ఈ గేమ్స్ ఆడాడు. దీంతో ఆ అప్పులు తీర్చేందుకు తల్లిదండ్రులు చివరికి పోలాన్ని అమ్మాల్సి వచ్చింది. పొలం అమ్మినా కూడా అప్పుడు తీరలేదు. దీంతో ఆ కుటుంబంలో ముగ్గురు చివరికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు